newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా సినిమానా..? వర్కవుట్ అవుతుందా..?

29-09-202029-09-2020 22:34:21 IST
2020-09-29T17:04:21.922Z29-09-2020 2020-09-29T17:04:19.829Z - - 25-10-2020

ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా సినిమానా..? వర్కవుట్ అవుతుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఎస్వీ కృష్ణారెడ్డి ఈ పేరు చెబితే మాయలోడు, కొబ్బరిబొండం, యమలీల, శుభలగ్నం, నెంబర్ వన్...ఇలా చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆయన సినిమాల్లో స్పెషాలిటీ ఏంటంటే.. క్లీన్ కామెడీ. ఎలాంటి డబల్ మీనింగ్ డైలాగులు లేకుండా... ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఆయన సినిమాలు ఉంటాయి. అందుకనే ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా అంటే.. అప్పట్లో ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లేవారు. ఆతర్వాత కెరీర్ లో ఆయన వెనకబడ్డారు. ఆమధ్య యమలీల 2 అనే సినిమా చేసారు. టాలీవుడ్ లో సీక్వెల్స్ ఏవీ సక్సస్ సాధించలేదు.

ఈ సెంటిమెంట్ ప్రకారం యమలీల 2 కూడా సక్సస్ అవ్వలేదు. అయితే... ఆతర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి బాలయ్యతో సినిమా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దాదాపు ఈ సినిమా కన్ ఫర్మ్ అనుకున్నారు కానీ.. ఎందుకనో ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... కృష్ణారెడ్డి పక్కా హిట్ కొట్టేలా ఓ మాంచి స్ర్కిప్ట్ రెడీ చేసారట. ఇందులో రాజేంద్రప్రసాద్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తారట.ఇక లీడర్ క్యారెక్టర్ ని ఎస్వీ కృష్ణారెడ్డే చేయాలి అనుకుంటున్నారట.

ఎస్వీ కృష్ణారెడ్డి లీడర్ రోల్ చేయడం కొత్తేమి కాదు. అప్పట్లో ఉగాది, అభిషేకం చిత్రాల్లో హీరోగా నటించారు. ఇప్పుడు ఈ వయసులో లీడ్ రోల్ చేయాలి అనుకుంటున్నారట. మరి... ఆయన ప్లాన్ వర్కవుట్ అవుతుందా..? లేదా..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle