newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

అభిమానులకి లేఖ వ్రాసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

08-05-202208-05-2022 07:16:13 IST
2022-05-08T01:46:13.366Z08-05-2022 2022-05-08T01:43:53.787Z - - 29-06-2022

అభిమానులకి లేఖ వ్రాసిన సూపర్ స్టార్ మహేష్ బాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట' పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తన అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ రిలీజ్ చేసారు. 'ప్రియమైన అభిమాన మిత్రులకు' అని సంబోధించిన అగ్ర హీరో.. ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాని థియేటర్లలో చూసి స్పందన తెలియజేయాలని కోరారు. మహేష్ బాబు రాసిన లేఖలో ''ప్రముఖ యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ - జి.యమ్. బి. ఎంటర్ టైన్ మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలపై ఎర్నేని నవీస్ - యలమంచిలి రవి శంకర్ - ఆచంట రామ్ - ఆచంట గోపిలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'సర్కారు వారి పాట' షూటింగ్ పూర్తయి.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. 

ఈ చిత్రం ఆడియో సరేగమ కంపెనీ ద్వారా మార్కెట్ లో విడుదలై.. రేటింగ్ లో విశేష సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన 'సర్కారు వారి పాట' చిత్రం థియేటర్ల లోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు. మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై యస్. రాధాకృష్ణ (చిన్న బాబు) నిర్మించే చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలు కాగలదు. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ శ్రేయోభిలాషి'' అని మహేష్ బాబు ఈ లేఖలో పేర్కొన్నారు. తమ అభిమాన హీరో తమని ఉద్దేశిస్తూ ఇలా ఓపెన్ లెటర్ విడుదల చేయడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.  ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖని - నదియా - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు - తనికెళ్ళ భరణి - పోసాని కృష్ణమురళి - మహేష్ మంజ్రేకర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఆర్ మదే సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేశారు.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle