newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

మా నాన్నగారే లేనప్పుడు 'భారతరత్న' ఎందుకు?? ఎస్పీ బాలు కుమారుడు..

29-09-202029-09-2020 12:31:18 IST
Updated On 29-09-2020 12:53:02 ISTUpdated On 29-09-20202020-09-29T07:01:18.802Z29-09-2020 2020-09-29T07:01:16.438Z - 2020-09-29T07:23:02.824Z - 29-09-2020

మా నాన్నగారే లేనప్పుడు 'భారతరత్న' ఎందుకు?? ఎస్పీ బాలు కుమారుడు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

గాన గంధర్వుడు, పద్మ భూషణ్, దేశం గర్వించదగ్గ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనాతో, మరి కొన్ని ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో పోరాడుతూ మరణించిన సంగతి తెలిసిందే. మన దేశంలోని 16 భాషల్లో యాభై వేలకు పైగా పాటలు పాడిన గొప్ప వ్యక్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. సంగీత ప్రపంచంలో ఆయనని ఎవరూ అందుకోలేరు. ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించారు.

అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా అవార్డులు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన మృతితో ఎంతో మంది అభిమానులు, అన్ని రంగాల ప్రముఖులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతిపై దేశ  వ్యాప్తంగా అన్ని పరిశ్రమల ప్రముఖులు తమకు బాలు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం ప్రకటిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని చాలామంది ప్రముఖులు, ప్రజలు, ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు భారతరత్న కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీలు అన్నీ కలిసి పోరాడాలని అంటున్నారు. భారతరత్నకు ఎస్పీబీ అన్ని విధాల అర్హుడు అని, అన్ని వేల పాటలు ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకెవ్వరు పాడలేరని, సినీ పరిశ్రమకి ఆయన చేసిన ఋణం ఎవరూ తీర్చలేనిది అని ప్రముఖులు అంటున్నారు. చాలామంది బాలు గారికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. తాజాగా నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ విషయంపై లేఖ రాశారు.

ఆ లేఖలో నిర్విరామంగా ఐదు దశాబ్దాలపాటు సంగీత ప్రేమికులు అలరించిన బాలు గొప్పతనాన్ని కొనియాడడంతో పాటు, వివిధ భారతీయ భాషలలో 50 వేలకు పైగా పాటలను పాడిన సంగతి గుర్తు చేశారు. గతంలో గాయకులు లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తదితరులకు భారతరత్న ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

బాలు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని, ఆయన అన్ని విధాలుగా భారతరత్నకి అర్హుడని అన్నారు. తాజాగా నిన్న బాల సుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. మా నాన్నగారే లేనప్పుడు మాకు భారతరత్న ఎందుకండి? మా భారతరత్న మా నాన్నగారే అని అన్నారు. గవర్నమెంటు ఇవ్వాలి అనుకుంటే భారతరత్న ఇస్తారు. లేదంటే పర్వాలేదు. నాన్నగారే  లేనప్పుడు భారతరత్న నాకెందుకు? ఒకవేళ ప్రభుత్వం భారతరత్న ఇస్తే సంతోషపడతాం. అంతకంటే ఏమి చేయలేము అని అన్నారు.  


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle