newssting
Radio
BITING NEWS :
పదవి నుంచి దిగిపోనున్న అమెరికా ప్రస్థుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ సలహాదారు రాజీనామా చేశారు. ట్రంప్ సలహాదారు అయిన స్కాట్ అట్లాస్ తన రాజీనామా లేఖను మంగళవారం పంపించారు * కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను భారత్‌ సాధ్యమైనంత త్వరలో పొందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. రష్యాలో భూకంపం సంభవించింది. భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది * ఆల్‌ ఇండియా జేఈఈ పరీక్షలో 270వ ర్యాంకు పొందిన ఒక యువకుడు ఒక్క తప్పిదంతో ప్రఖ్యాత ఐఐటీలో ఇంజనీరింగ్‌ సీటు కోల్పోయాడు. అక్టోబర్‌ 31న తన రోల్‌నెంబర్‌పై అప్‌డేట్ల కోసం నెట్‌లో బ్రౌజ్‌ చేస్తుండగా విత్‌ డ్రా ఫ్రం సీట్‌ అలకేషన్‌ అండ్‌ ఫరదర్‌ రౌండ్స్‌ లింక్‌ను తను క్లిక్‌ చేయడంతో సీటు కోల్పోయాడు * ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘బురేవి’ వాయుగుండంగా మారడంతో దీని ప్రభావం వల్ల దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరప్రాంతాల్లో మంగళవారం మరో సారి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది * దేశరాజధానిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా మృతుల సంఖ్య తిరిగి వంద దాటింది. కరోనాతో మొత్తం 108 మంది మృతి చెందారు. ఇదే సమయంలో కొత్తగా 3,726 కరోనా కేసులు నమోదయ్యాయి * కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో గత ఆరు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఈ మూడో దఫా చర్చలు జరగనున్నాయి * శ్రీలంకలోని మహారా జైలులో ఘర్షణలు చోటు చేసుకుని ఎనిమిది మంది ఖైదీలు మృతి. మరో 37 మందికి గాయాలు. వారిలో ఇద్దరు జైలర్లు ఉండగా గాయాలపాలైన వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది * సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఢిల్లీకి వెళ్లే శాలిమార్‌ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల ముందే రైల్వేస్టేషన్‌ నుండి బయల్దేరడంతో.. రైళ్లు వెళ్లే సమయంపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైల్వే అధికారులు ఇబ్బంది పెట్టారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు * యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉత్కంఠకు గురి చేసేలా జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య 9 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో ఓట్లు వేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా తీసుకున్న ఏర్పాట్లు చేశారు * నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు * నేటితో ముగియనున్న తుంగభద్ర పుష్కరాలు. కార్తిక సోమవారం సందర్భంగా ఘాట్లలో నిన్న భక్తుల తాకిడి పెరిగింది. మహిళలు నదిలో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించగా.. నేడు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. పుష్కరాల ముగింపు వేళ భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా * తమిళనాడుకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా.. తర్వాత తుపానుగా మారనుంది. ఇది బుధవారం తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది * టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ అధికారులు ఊహించని షాక్‌. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో భారీ జరిమానా. త్రిశూల్‌ సిమెంట ఫ్యాక్టరీలో జేసీ భారీ ఎ‍త్తున అక్రమాలకు పాల్పడ్డారని రూ.100 కోట్ల జరిమానా విధించాలని నిర్ణయం.

ఆచార్య సెట్ లో సోనూసూద్

21-11-202021-11-2020 19:13:52 IST
2020-11-21T13:43:52.227Z21-11-2020 2020-11-21T13:43:41.863Z - - 01-12-2020

ఆచార్య సెట్ లో సోనూసూద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిన ఈ మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. అయితే.. ఈ మూవీలో సోనూసూద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే... ఆచార్య షూటింగ్ లో సోనూసూద్ పాల్గొన్నారు. సోనూసూద్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే... కరోనా టైమ్ లో సోనూసూద్ చేసిన సాయం అంత ఇంతా కాదు. కష్టం అంటే చాలు నేనున్నాను అంటూ ముందుకొచ్చాడు. ఎంతో మందిని గమ్య స్ధానాలకు చేర్చాడు. తను చేసిన సాయం వలన ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడు. సోనూ చేసిన సాయంతో ఆయన ఎక్కడికి వెళ్లినా గౌరవం దక్కుతుంది. అసలు విషయానికి వస్తే...తాజాగా..సోనూసూద్ ఆచార్య‌ సెట్లో అడుగుపెట్టాడు‌. ఈరోజే సోనూసూద్ సెట్లో అడుగుపెట్టాడు. అందుకే.. చిత్ర‌బృందం సోనూకి చిరు స‌త్కారం అందించింది.

త‌నికెళ్ల భ‌ర‌ణి, కొర‌టాల ఇద్ద‌రూ క‌లిసి, సోనూని సాద‌రంగా సెట్లోకి ఆహ్వానించారు. సోనూసూద్ కి శాలువా కప్పి సన్మానం చేసారు. త్వరలో చిరంజీవి ఈ షూటింగ్ లో పాల్గొంటారు. త్వరలోనే చిరు, కాజల్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే కీలక పాత్ర పోషిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఈ మూవీని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

బజారు రౌడీగా మారిన సంపూర్ణేశ్!

బజారు రౌడీగా మారిన సంపూర్ణేశ్!

   43 minutes ago


ప్రియుడి గిఫ్ట్ కి పొంగిపోయిన మాజీ విశ్వ సుందరి!

ప్రియుడి గిఫ్ట్ కి పొంగిపోయిన మాజీ విశ్వ సుందరి!

   2 hours ago


డర్టీ పిక్చర్ లా షకీలా బయోపిక్.. మరి  సక్సెస్ అయ్యేనా?

డర్టీ పిక్చర్ లా షకీలా బయోపిక్.. మరి సక్సెస్ అయ్యేనా?

   3 hours ago


శింబుకి కాస్ట్ లీ కార్ గిఫ్ట్..!

శింబుకి కాస్ట్ లీ కార్ గిఫ్ట్..!

   4 hours ago


ఏఎంబీ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్.. వీ ఆర్ ఆల్ సెట్ టు ఓపెన్

ఏఎంబీ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్.. వీ ఆర్ ఆల్ సెట్ టు ఓపెన్

   5 hours ago


మరో పాన్ ఇండియా సినిమాకు ప్రభాస్ సై..

మరో పాన్ ఇండియా సినిమాకు ప్రభాస్ సై..

   6 hours ago


మొగుడు లేక‌పోతే బ‌త‌క‌లేను అని ఏడ్చిన హీరోయిన్ జెనీలియా

మొగుడు లేక‌పోతే బ‌త‌క‌లేను అని ఏడ్చిన హీరోయిన్ జెనీలియా

   9 hours ago


సీక్రెట్ గా మ్యారేజీలు.. సైలెంట్ గా బాగోతాలు.. బిగ్ బాస్ బేబీ సెక‌లు

సీక్రెట్ గా మ్యారేజీలు.. సైలెంట్ గా బాగోతాలు.. బిగ్ బాస్ బేబీ సెక‌లు

   9 hours ago


ఇండియాలో భారీ బడ్జెట్ తో నాగార్జున నటించే సినిమా!

ఇండియాలో భారీ బడ్జెట్ తో నాగార్జున నటించే సినిమా!

   20 hours ago


లార్డ్ స్కందగిరి ఆలయంలో 365 ఒత్తులను వెలిగించిన 'నిఖిల్'

లార్డ్ స్కందగిరి ఆలయంలో 365 ఒత్తులను వెలిగించిన 'నిఖిల్'

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle