ఫస్ట్ టైం మ్యూజిక్ వీడియోలో సోనూ.. ఫ్యాన్స్ హ్యాపీ
16-01-202116-01-2021 14:21:50 IST
Updated On 16-01-2021 14:28:27 ISTUpdated On 16-01-20212021-01-16T08:51:50.375Z16-01-2021 2021-01-16T08:51:30.572Z - 2021-01-16T08:58:27.959Z - 16-01-2021

నటీనటులు సినిమాలతో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా మెరుస్తుంటారు. కాగా హీరో సోనూసూద్ కూడా ఓ ప్రైవేట్ ఆల్బమ్ లో మెరిశాడట. విలన్ గా దూసుకుపోతోన్న ఈ సమయంలో సోనూసూద్ కి ఇటువంటి ఆఫర్ రావడం గ్రేటనే చెప్పాలి. ఎందుకు రావు ఇప్పుడు సోనూ రేంజ్ మారింది కదా..వలస బాధితులకైతే దేవుడిగా మారిపోయాడు మరి. దాంతో విలన్ నుండి హీరోగా మారుతున్నాడు సోనూసూద్.. అవును మరి సోనూసూద్ కి నెగెటివ్ రోల్స్ ఇచ్చేందుకు భయపడుతున్నారట పలువురు దర్శక..నిర్మాతలు. దేశవ్యాప్తంగా వేలాది మందికి అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకుంటున్నాడు సోనూసూద్. రియల్ హీరోగా ప్రశంసలందుకుంటున్న సోనూసూద్ ని విలన్ గా చూపించేందుకు కూడా రెడీగా లేరట దర్శక..నిర్మాతలు. దాంతో హీరోగా ఆయన ఓ సాంగ్ లో మెరిశాడట. సోనూసూద్ తాజాగా తొలిసారి ఓ మ్యూజిక్ వీడియోలో నటించాడు. సింగర్ సునంద శర్మతో కలిసి పాగల్ నహీ హోనా మ్యూజిక్ వీడియోలో నటించాడు. ఇద్దరు ప్రేమికుల మధ్య రొమాంటిక్ గా సాగుతుందీ పాట. కాగా సోనూసూద్ దీంట్లో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడట..అతన్ని ప్రేమించే యువతిగా సునంద శర్మ నటించింది. పట్టణానికి దూరంగా సోనూసూద్ కు పోస్టింగ్ వస్తోంది. అయితే సునంద తన ప్రియుడు తిరిగొచ్చే వరకు వెయిట్ చేస్తుంది. చివరికి ఇద్దరు కలవడంతో వీడియో ముగుస్తుంది. పింకీ ధలివాల్-మ్యాడ్ 4 మ్యూజిక్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ పాటను జాని రాయగా..అవ్విస్రా కంపోజ్ చేశారు. ఇది నా తొలి మ్యూజిక్ వీడియో. కాన్సెప్ట్ వినగానే వెంటనే ఒకే చెప్పాను. పాగల్ నహీ హోనా సాంగ్ ను ఆర్మీ జవాన్లకు, వారి ప్రేమించే వారికి అంకితమిస్తున్నా. పాట లిరిక్స్ మీ మనస్సును హత్తుకుంటాయి. సునంద చాలా అందంగా పాడింది అంటూ సోనూసూద్ ట్వీట్ చేశాడు. సోనూసూద్ ఈ సాంగ్ లో చాలా గ్లామర్ గా ఉన్నాడు..ఈ సాంగ్ లోని విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్ ఆద్యంతం ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ చూసిన సోనూసూద్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారట. రియల్ హీరో రీల్ హీరోగా మారుతున్నాడు మెల్ల మెల్లగా.

సినిమా ఏకీ నంబర్.. రెమ్యునరేషన్ ఏకీ క్రోర్
19 hours ago

విజయశాంతిలా ఇష్యూ చేస్తున్న సమంత
21 hours ago

అన్నదమ్ముల బాక్సాఫీస్ ఫైట్.. నెగ్గేది ఎవరు..? తగ్గేది ఎవరు..?
07-03-2021

ఈ సినిమా వాళ్లకి దొబ్బేసే అలవాటు ఎప్పుడు పోతుంది
07-03-2021

జాతిరత్నంతో అనుష్క రొమాన్స్
07-03-2021

భీష్మ డైరెక్టర్ ని ఎలా బురిడీ కొట్టించాడు.. మొత్తం కథ
05-03-2021

నాని సినిమాపై హాట్ బేబీ కంప్లైంట్.. ఆపేయాలన్న బాంబే హైకోర్టు
05-03-2021

ప్రదీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత క్యూ
04-03-2021

బాలయ్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి
03-03-2021

హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యారవ్యాన్ లో ఏం జరుగుతోంది
03-03-2021
ఇంకా