హాలీవుడ్ పాప్ సింగర్ ను మించిపోతున్న శృతిహాసన్
13-01-202113-01-2021 20:12:49 IST
Updated On 13-01-2021 19:32:32 ISTUpdated On 13-01-20212021-01-13T14:42:49.931Z13-01-2021 2021-01-13T13:37:16.631Z - 2021-01-13T14:02:32.048Z - 13-01-2021

హీరోయిన్ శృతిహాసన్ మాంచి జోరుమీద ఉంది..క్రాక్ మూవీతో ఇటీవలే ప్రేక్షకులముందుకు వచ్చిందీ నాజూకు బ్యూటీ. ఈ మూవీ హిట్ మాట పక్కనపెడితే కలెక్షన్స్ తో మాత్రం దూసుకుపోతోందీ మూవీ. దాంతో శృతిహాసన్ తెగ సంతోషంలో ఉంది. తన కమ్ బ్యాక్ మూవీహిట్ అవ్వడంతో చెలరేగిపోతోందీ విశ్వ నటుడి కుమారై. మాస్ మహారాజ్ రవితేజ సరసన క్రాక్ లో తన అందాలతో ఆకట్టుకుంది శృతిహాసన్. చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రుతికి `క్రాక్` పాజిటివ్ రిపోర్ట్ తీపి గుళిక లాంటిదేననే చెప్పాలి. తదుపరి సమ్మర్ కానుకగా పవర్ స్టార్ సరసన నటించిన వకీల్ సాబ్ రిలీజ్ కానుంది. కంబ్యాక్ కోసం ఎంతగానో తపిస్తున్న శ్రుతికి కొత్త ఏడాది పాజిటివ్ నోట్ తోనే మొదలైంది.
ఇన్ స్టా వేదికగా క్రాక్ కి శృతిహాసన్ అద్భుత ప్రచారం చేసింది. మీడియా ఇంటర్వ్యూ లకు మాత్రం చాలా దూరంగా ఉండడం విమర్శలకు తావిచ్చింది. ఇకపోతే ఇన్ స్టాలోశృతి లేటెస్ట్ ఫోటోషూట్ హీట్ పెంచింది.ది క్యాండీ మ్యాగజైన్ కవర్ పేజీపై అందాల శ్రుతి పరువాల సోయగం వేడెక్కిస్తోంది. ది ట్రూ బార్న్ ఆర్టిస్టు అన్న ట్యాగ్ తో 2021 జనవరి కవర్ సంథింగ్ హాట్ గా యూత్ లోకి దూసుకెళుతోంది. ముఖ్యంగా డిజైనర్ థై స్లిట్ ఫ్రాకులో శృతిహాసన్ థై సొగసుల్ని ఎలివేట్ చేస్తూ ఈ ఫోటోషూట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ కవర్ షూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫొటోలో బ్రౌన్ కలర్ డ్రెస్ ..ఆ డ్రెస్ కి మ్యాచింగ్ గా బ్రౌన్ డిజైనర్ షూ.. ఫొటోకి ఇచ్చిన ఫోజ్ అన్నీ ఫర్ ఫెక్ట్ అనే చెప్పాలి..ఏదో ఇంగ్లీష్ పాప్ సింగర్ లా కనిపిస్తోంది శృతిహాసన్ అవతారం. ఎంతైనా విదేశాలలో తిరిగి తిరిగి వచ్చింది కదా ఆ మాత్రం బాగానే ఒంటికి ఎక్కించుకున్నట్టు ఉందీ అంటున్నారు ఈ ఫొటో చూసిన నెటిజన్స్. ఎవరేమన్నా వాటిని పట్టించుకోవడం..వాటిపై స్పందించడం ఎప్పుడో మానేసింది శృతీహాసన్.



సలార్ లో దిశాపటానీ, జాన్ అబ్రహం నిజమేనా?
4 hours ago

అమ్మడి అందాలు చూస్తే హార్ట్ బీట్ పెరగాల్సిందే..
5 hours ago

రిచాకి గెస్ట్ రోల్ ఆఫర్ చేసిన హరీష్.. రీ ఎంట్రీ ఇస్తుందా?
6 hours ago

సూసైడ్ చేసుకోవాలనుకున్న డైరెక్టర్ కమ్ యాక్టర్
7 hours ago

నిధి అగర్వాల్ ఆరబోత.. ఇంత రెచ్చిపోతే ఎలా
9 hours ago

డైరెక్టర్ గా కంగనా.. మహారాణి దిద్దాగా అవతారం
10 hours ago

ఆడియన్స్ ని ఆకట్టుకుంటోన్న జాంబీరెడ్డి కరోనా సాంగ్
10 hours ago

ఫస్ట్ టైం మ్యూజిక్ వీడియోలో సోనూ.. ఫ్యాన్స్ హ్యాపీ
12 hours ago

మహేశ్ బాబు భార్య పోస్టుపై బుంగమూతి పెట్టుకున్న నిర్మాత
12 hours ago

త్రివిక్రమ్ తో ఈ డైరెక్టర్ కి అన్యాయం జరుగుతోందా
15 hours ago
ఇంకా