newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

రేపిస్టులను పబ్లిక్ లో కాల్చి చంపాల్సిందే..'కంగనారనౌత్'

29-09-202029-09-2020 15:04:39 IST
2020-09-29T09:34:39.791Z29-09-2020 2020-09-29T09:34:36.663Z - - 21-10-2020

రేపిస్టులను పబ్లిక్ లో కాల్చి చంపాల్సిందే..'కంగనారనౌత్'
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓ పక్క మహిళలకు సమాన హక్కులు..వారే మహారాణులు అంటుంటే..మరో పక్క ఆడవారి పట్ల జరిగే అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. మహిళల పట్ల అమానుష ప్రవర్తనకి పాల్పడుతున్నారు పలువురు మృగాలు. రీసెంట్ గా  మరో నిర్భయని తలపించే ఘటన చోటు చేసుకుంది. ఓ 19ఏళ్ళ యువతిని ఘోరాతి ఘోరంగా హింసించి..వేధించి మరీ ఆమె చావుకు కారణమయ్యారు దుండగులు..ఈ ఉదంతంపై స్పందించింది బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్.  రేపిస్టులను ఉరి తీయాలని తెలిపింది.

పలు సామాజిక అంశాలపై ముక్కు సూటిగా మాట్లాడే కంగనా రనౌత్ ఢిల్లీ ఆసుపత్రిలో కన్నుమూసిన సామూహిక అత్యాచార బాధితురాలుకి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ..అలాంటి వారిని ఊరికే వదలిపెట్టవద్దని తెలిపింది.  మహిళల సమస్యలపై ముందుకు వచ్చి పలు విషయాలపై తన అభిప్రాయాన్ని బహిరంగంగా మాట్లాడంలో ముందుంటుంది కంగనా.

హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసుపైనా కంగన గట్టి వైఖరిని ఎంచుకుంది. బాధితురాలు ఢిల్లీ ఆసుపత్రిలో మరణించిన తరువాత ఆ ఘోరకృత్యాన్ని ఖండించింది. యుపిలో 19 ఏళ్ల యువతిపై హత్రాస్ (ఉత్తరప్రదేశ్) గ్యాంగ్ రేప్ సంఘటనపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనల పెరుగుదలను కూడా కంగన ప్రశ్నించింది.

ఈ రేపిస్టులను బహిరంగంగా కాల్చండి.. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఈ సామూహిక అత్యాచారాలకు పరిష్కారం ఏమిటి? ఈ దేశానికి ఎంత విచారకరమైన..  సిగ్గుపడే రోజు. వ్యవస్థ విఫలమైంది. ఈ ఘటనకు కారకులైన నిందితులను అస్సలు తప్పించవద్దని ఉరి తీయాలని యువతి సోదరుడు డిమాండ్ చేశాడు. ఈ విషయమై కేవలం కంగనా మాత్రమే కాదు.. బాధితురాలికి న్యాయం చేయాలని దేశం కూడా  కోరింది.

ఈ సంఘటనను సోషల్ మీడియాలో ఖండించడానికి పలువురు హీరోయిన్స్ రిచా చద్దా.. యామి గౌతమ్ వంటి అనేక మంది తారలు కూడా ముందుకు వచ్చి నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన తరువాత.. బాధితురాలిని చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మంగళవారం ఉదయం కన్నుమూసింది. ఈ సంఘటన దేశంలోని ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించిన బాధితురాలికి న్యాయం చేయాలని చాలా మంది ట్విట్టర్ లో కోరుతున్నారు. మరి  ఆ యువతికి న్యాయం జరిగేనా అంటే వేచి చూడాలి.

 

సీఎంగా చిరు - డైరెక్టర్ వినాయక్. ఆతర్వాత ఏమైంది..?

సీఎంగా చిరు - డైరెక్టర్ వినాయక్. ఆతర్వాత ఏమైంది..?

   7 hours ago


ఆర్ఆర్ఆర్ పై అప్ డేట్ ఇచ్చిన చిత్రయూనిట్. ఇంతకీ ఏంటది..?

ఆర్ఆర్ఆర్ పై అప్ డేట్ ఇచ్చిన చిత్రయూనిట్. ఇంతకీ ఏంటది..?

   7 hours ago


చిరు, ప‌వ‌న్ ని ఫాలో అవుతున్న‌ మోహ‌న్ బాబు

చిరు, ప‌వ‌న్ ని ఫాలో అవుతున్న‌ మోహ‌న్ బాబు

   8 hours ago


ఏంటి నోయ‌ల్ ఓట్ల‌కోసం తండ్రి గురించి ఇలా చెప్తావా.. క్లారిటీ ఇదిగో

ఏంటి నోయ‌ల్ ఓట్ల‌కోసం తండ్రి గురించి ఇలా చెప్తావా.. క్లారిటీ ఇదిగో

   9 hours ago


ట్రాన్స్ జెండర్స్ తో ‘లక్ష్మీ బాంబ్' చిత్రం ప్రమోషన్..

ట్రాన్స్ జెండర్స్ తో ‘లక్ష్మీ బాంబ్' చిత్రం ప్రమోషన్..

   10 hours ago


బాలయ్య నర్తనశాల ఫస్ట్ లుక్ రిలీజ్

బాలయ్య నర్తనశాల ఫస్ట్ లుక్ రిలీజ్

   12 hours ago


మెగా హీరో మూవీలో న‌టిస్తున్న రానా. ఇంతకీ ఏ సినిమాలో..?

మెగా హీరో మూవీలో న‌టిస్తున్న రానా. ఇంతకీ ఏ సినిమాలో..?

   12 hours ago


పాపం బ్రహ్మాజీ... ఏదో చేద్దాం అనుకుంటే.. ఇంకేదో అయ్యింది!

పాపం బ్రహ్మాజీ... ఏదో చేద్దాం అనుకుంటే.. ఇంకేదో అయ్యింది!

   12 hours ago


ఇటలీలో పిల్లలతో ఎంజాయ్ చేస్తోన్న బాహుబలి..

ఇటలీలో పిల్లలతో ఎంజాయ్ చేస్తోన్న బాహుబలి..

   13 hours ago


'దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే'కి అరుదైన గౌరవం..

'దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే'కి అరుదైన గౌరవం..

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle