newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

వరదల్లో కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాతగారి ఇల్లు..

30-09-202030-09-2020 16:24:45 IST
Updated On 30-09-2020 16:41:21 ISTUpdated On 30-09-20202020-09-30T10:54:45.891Z30-09-2020 2020-09-30T10:54:42.736Z - 2020-09-30T11:11:21.829Z - 30-09-2020

వరదల్లో కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాతగారి ఇల్లు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యంగ్ హీరో శర్వానంద్  తీపి గుర్తులని కోల్పోయారట. ఎంత హీరో అయినా వారికి ఫ్యామిలీ ఉంటుంది..తాత..అమ్మమ్మ..నాన్నమ్మ ఇలా ఫ్యామిలీలోని పెద్ద వారితో వారి అనుబంధాలు విడదీయరానివిగా ఉంటాయి. సినిమాలతో ఎంత బిజిగా ఉన్నా వారికి తీరని కోరికలు కూడా ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు తాము నడయాడిన ఇళ్లు..పుట్టి పెరిగిన ఊరిని చుట్టి వస్తుంటారు పలువురు తారలు. కాగా శర్వానంద్ కి తన తాతగారి ఇళ్ళంటే ఎనలేని ప్రేమట. అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్ళి వస్తుండేవాడట ఈ హీరో. కానీ ఇప్పుడా ఇళ్లు లేదట..ఏమయింది అనుకుంటున్నారా..

తన తాతగారి ఇళ్ళు శర్వానంద్ కి ఎనలేని తీపి గురుతుల్ని గుర్తు చేస్తుందట. కానీ అటువంటి తీపి గుర్తులని  కోల్పోతున్నారు టాలీవుడ్ హీరో శర్వానంద్. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఆయనకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా చోటు చేసుకున్న కృష్ణానది వరద ప్రభావానికి ఆయన తాతగారి ఇల్లు కొట్టుకుపోయింది. క్రిష్ణా జిల్లా అవనిగడ్డలో శర్వానంద్ తాత కమ్ భారత మాజీ అణుశాస్త్రవేత్త డాక్టర్ మైనేని హరిప్రసాద్ నివాసం ఉంది.

అణుశాస్త్రవేత్తగా.. సంఘసేవకుడిగా పేరున్న హరిప్రసాద్ నివాసం తాజాగా వరదల్లోకొట్టుకుపోవటంపై శర్వానంద్ తో పాటు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహానికి కాస్త పక్కనే ఉన్న ఈ భవనం.. నీటి తాకిడికి సగానికి పైనే కొట్టుకు పోయిందట. గత ఏడాది సంభవించిన వరదల్లో శర్వానంద్ ముత్తాతకు చెందిన పెంకుటిల్లు పూర్తిగా కృష్ణానదిలో కొట్టుకు పోయింది.

కాగా ఏడాదిలోనే ఈసారి తాతగారి ఇల్లు కొట్టుకుపోవటం గమనార్హం. హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాత అవనిగడ్డ వచ్చిన సందర్భంగా శర్వానంద్ ఈ ఇంట్లోనే గడిపేవాడట. అణు శాస్త్రవేత్తగా, సంఘ సేవకుడిగా మైనేని హరిప్రసాద్, సినీ నటుడిగా శర్వానంద్‌ గుర్తింపు కలిగిన వారు కావడంతో వారికి చెందిన భవనం వరదల్లో కొట్టుకుపోతుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ ఇంటి పరిసరాల్లో నిలబడి ఒకింత ఆవేదనకు గురయ్యారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle