newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

డర్టీ పిక్చర్ లా షకీలా బయోపిక్.. మరి సక్సెస్ అయ్యేనా?

01-12-202001-12-2020 13:41:56 IST
Updated On 01-12-2020 16:20:28 ISTUpdated On 01-12-20202020-12-01T08:11:56.544Z01-12-2020 2020-12-01T08:11:48.147Z - 2020-12-01T10:50:28.507Z - 01-12-2020

డర్టీ పిక్చర్ లా షకీలా బయోపిక్.. మరి  సక్సెస్ అయ్యేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నో బయోపిక్ లు ప్రస్తుతం తెరపైకెక్కాయి. ఇంకా పలు బయోపిక్ లు రూపొందుతున్నాయి. కాగా శృంగారతారగా పేరు గాంచిన నటి జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రానుంది. ఇప్పటికే సిల్క్ స్మితపై హిందీలో డర్టీ పిక్చర్ పేరుతో వచ్చిన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరో శృంగార తార షకీలా బయోపిక్ తెరకెక్కనుంది.  మలయాళ శృంగార తార షకీలా జీవితం ఆధారంగా ఆమె పేరుతోనే బాలీవుడ్ లో సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ హీరోయిన్  రిచా చద్దా ఇందులో టైటిల్ పాత్రను పోషిస్తోంది. 2020 క్రిస్మస్ కానుకగా ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. బహుళ భాషా విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం.

South Indian actress Shakeela Khan was forced into adult films to support  siblings, mother - Orissa Post | DailyHunt

ఇంతకుముందు రిచా చద్దా `షకీలా` లుక్ రిలీజై వైరల్ అయ్యింది. తాజాగా లాంచ్ అయిన పోస్టర్ రిచాను ఆకర్షణీయమైన అవతారంలో ఆవిష్కరించింది. రెడ్  చీరలో ఉన్నా చేతిలో తుపాకీతో ఆమె సౌత్ సైరన్ పాత్రకు సరైన నటి అన్న భావన కలిగించింది. అయితే బాక్సాఫీస్ ఫలితం పోస్టర్ లుక్ తో సాధ్యం కాదు. షకీలా రేంజులో ఊపే  ఫ్యాక్టర్ ని ఎలివేట్ చేయడంలో సక్సెసైతేనే కిక్కుంటుంది. అలాగే షకీలా జీవితంలో సౌత్ స్టార్ల పాత్రలు వర్కవుటైతే ఇక్కడ బాగా డబ్బు గుంజే వీలుంటుంది. షకీలా స్కిన్ షో.. అశ్లీల పదాలు.. మతపరమైన అనుబంధం ..తన రంగుకు సంబంధించిన ఎన్నో విషయాల్ని యథాతథంగా చూపించగలగాలి. షకీలా వైఖరిని శైలిని రిచాచద్దా  ప్రతిబింబిస్తుందని ఈ ఒక్క పోస్టర్ తో నిర్ణయించేయడం సరికాదు.

Richa Chadda Sexy Instagram Photo: actress Richa Chadda hot sexy bikini  photo video will make you happy,have a unseen look-ऋचा चड्ढा ने इंस्टाग्राम  पर शेयर की सेक्सी फोटो, बिकनी में ढा रहीं

సూపర్ స్టార్ షకీలా జీవితంలోని ఎన్నో దిగ్భ్రాంతికరమైన నిజాలనుంచి ప్రేరణ పొందిన ఈ చిత్రం ఆమె ప్రయాణంలో అడ్డంకులు వివక్షలను తెరపై చూపించనున్నారా? అన్నది చూడాలి. సైడ్ క్యారెక్టర్లను పోషించడం నుండి బి-గ్రేడ్ చిత్రాల తారగా వెలిగిపోవడం అటుపైన శృంగార నాయికగా కీర్తి పరాకాష్టకు చేరుకోవడం ఇదంతా ఆమె లైఫ్. షకీలా ఎదుగుదల గిట్టని కొందరు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్లు ఆమెను బెదిరించడం వగైరా ఎన్నో విషయాల్ని తెరపై చూపిస్తున్నారా? అన్నది చూడాలి. సాంప్రదాయిక ముస్లిం కుటుంబంలో జన్మించిన షకీలా తన 16 వ ఏట తన నట వృత్తిని ప్రారంభించింది. సుమారు 250 చిత్రాలలో పనిచేసిన ఆమె 1990 ల చివరలో 2000ల ప్రారంభంలో దక్షిణ చిత్ర పరిశ్రమలను పరిపాలించిన నవయవ్వన సాఫ్ట్ శృంగార తారగా ఎదిగింది.

ఈ చిత్రం గురించి దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ మాట్లాడుతూ “షకీలా అభిరుచి ఉన్న ప్రాజెక్ట్. ఆమె 2003 నుండి నటిగా తెలుసు. ఆమె రాగ్-టు-రిచెస్ కథ నా దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ కోసం తనను కొన్ని విస్తృతమైన వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేసాను. ఆ వ్యక్తి గురించి చాలా తెలుసుకున్నాను ఆమె ఒక గొప్ప స్టార్ .. తన వెనుక చాలా సంగతి ఉంది. రిచా మాత్రమే ఈ పాత్రను చేయగలరని నమ్మాను. చిత్ర పరిశ్రమలో భాగం కావాలని కోరుకునే యువతకు మితిమీరిన గ్లిట్జ్ గ్లామర్ గురించి అర్థం చేసుకోవడానికి ఈ చిత్రం సహాయపడుతుందని వెల్లడించారు. పకీజ్ త్రిపాఠి- మలయాళ నటుడు రాజీవ్ పిళ్ళై కూడా షకీలా చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని సామిస్ మ్యాజిక్- సినిమా మోషన్ పిక్చర్ ప్రొడక్షన్ సమర్పించి నిర్మించింది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle