మరో విభిన్న పాత్రలో కనిపించనున్న సత్యదేవ్!
05-12-202005-12-2020 17:12:41 IST
Updated On 05-12-2020 18:51:09 ISTUpdated On 05-12-20202020-12-05T11:42:41.177Z05-12-2020 2020-12-05T11:42:00.410Z - 2020-12-05T13:21:09.382Z - 05-12-2020

విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ డిఫరెంట్ క్యారెక్టర్లను చేస్తూ తన నటనకి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంటున్నాడు హీరో సత్యదేవ్..ఆయన నటించిన చిత్రాలు చూస్తే 'బ్రోచేవారెవరు రా'... 'బ్లఫ్ మాస్టర్'.. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ''తిమ్మరుసు''. ‘అసైన్మెంట్ వాలి’ అనేది దీనికి ఉపశీర్షిక. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై మహేష్ కోనేరు - సృజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సత్యదేవ్ సరసన హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటిస్తోంది.
వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న 'తిమ్మరుసు' సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు(శనివారం) చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'తిమ్మరుసు' ఫస్ట్ లుక్ లో సత్యదేవ్ చేతిలో ఓ సూట్ కేస్ పట్టుకొని బైక్ పై కూర్చుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. వైవిధ్యభరిత చిత్రాలు చేస్తూ వస్తున్న సత్యదేవ్ మరో కొత్త తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర మేకర్స్ ప్రకటించారు.
''తిమ్మరుసు సినిమా ఓ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంమట. సత్యదేవ్ ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇదని తెలిపారు. ఈ రోజు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నాం. డిసెంబర్ 9న టీజర్ ను విడుదల చేస్తాం. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఇతర విషయాలు తెలియజేస్తాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకల సంగీతం సమకూరుస్తుండగా.. అప్పు ప్రభాకర్ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో బ్రహ్మాజీ - అజయ్ - ప్రవీణ్ - ఆదర్శ్ బాలకృష్ణ - ఝాన్సీ - వైవా హర్ష - సంధ్యా - జనక్ తదితరులు నటిస్తున్నారు. ఫస్ట్ లుక్‌లో సత్యదేవ్ బుల్లెట్‌పై కూర్చొని చాలా సీరియస్‌గా కనిపిస్తున్నారు. ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తుండగా, సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించనున్నారు.

ధర్మస్థలి ఇలా ఉండబోతోంది.. ఆసక్తిని పెంచేస్తున్న 'ఆచార్య'
an hour ago

సైనా నేహ్వాల్ బయోపిక్..డిజిటల్ రిలీజ్ కి రెడీ
37 minutes ago

బుట్టబొమ్మకు బుట్టనిండా డబ్బులు కావాలట
16 minutes ago

మిథాలీ రాజ్ బయోపిక్ కోసం తాప్సీ ట్రైనింగ్..కష్టే ఫలి
2 hours ago

బికినీ వేసి బుట్ట చేత పట్టుకున్న విదేశీ బ్యూటీ..వైరల్ గా పిక్
3 hours ago

శృతిహాసన్ బర్త్ డే..సలార్ హీరోయిన్ గా ఫిక్స్
5 hours ago

గూస్ బంబ్స్ వచ్చేలా పుష్ప పోస్టర్..రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన బన్నీ
6 hours ago

ఎడారిలో పుషప్స్..దటీజ్ తాప్సీ
21 hours ago

మాస్టర్ టీం కి అమెజాన్ షాక్...ఏం జరిగింది..
21 hours ago

ఎద సంపదతో ఎదలను కోసేస్తుందే..
9 hours ago
ఇంకా