ఆ నాలుగు థియేటర్లలో 'సర్కారు వారి పాట' 6 షోలు
11-05-202211-05-2022 21:55:01 IST
2022-05-11T16:25:01.447Z11-05-2022 2022-05-11T16:24:57.486Z - - 29-06-2022

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పెషల్ షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదల రోజయిన మే 12న ఉదయం 4 గంటలకే ఒక స్పెషల్ షో ప్రదర్శించుకునేందుకు నాలుగు థియేటర్ల కి అనుమతినిచ్చింది. కూకట్పల్లిలోని భ్రమరాంబ, మల్లీ కార్జున, విశ్వనాథ్ థియేటర్లు, మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. సర్కారు వారి పాట సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ విజ్ఞప్తి మేరకు ఈ సినిమాను మే 12న ఒక స్పెషల్ షోను నిర్వహించుకునేందుకు అనిమతి ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా పేర్కొన్నారు. కాగా సర్కారు వారి పాట సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పెంపు కూడా వారం రోజులు అంటే మే 12 నుంచి 18 వరకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ ఏడు రోజులు రోజూ ఐదు షోలు నడిపేందుకు వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు.

ఆమె అద్భుతమైన డ్యాన్సర్ ....!
14-05-2022

బ్లాక్బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారువారి పాట
12-05-2022

రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకున్న బాలయ్య `అన్ స్టాపబుల్` షో
11-05-2022

విజయ్ సినిమాలో శ్రీకాంత్..!
11-05-2022

ఆచార్య ఫ్లాప్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాత్ర కూడా
10-05-2022

ప్రభాస్ కు జోడీగా మాళవిక ..!
09-05-2022

తీవ్ర నష్టాలలో ఉన్న ఆచార్య డిస్టిబ్యూటర్లకి మెగాస్టార్ అభయం ఇస్తారా..?
09-05-2022

కాజల్ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు ..!
08-05-2022

మహేశ్ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
08-05-2022

రామ్ గోపాల్ వర్మ ఇక సినిమాల దుకాణం సర్దేయాల్సిందేనా..?
08-05-2022
ఇంకా