newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

బజారు రౌడీగా మారిన సంపూర్ణేశ్!

01-12-202001-12-2020 16:17:35 IST
2020-12-01T10:47:35.771Z01-12-2020 2020-12-01T10:46:51.395Z - - 28-01-2021

బజారు రౌడీగా మారిన సంపూర్ణేశ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

టాలెంట్ ఉండాలే కానీ రూపంతో పని ఏముందని నిరూపించాడు హీరో సంపూర్ణేశ్ బాబు. అంతేనా చేసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా బర్నింగ్ స్టార్ అనే బిరుదుని సంపాదించుకోవడం విశేషం. ఈ బాబు రాకతో తెలుగు సినిమాల్లో ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. సెటైరిక్ గా కూడా సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించవచ్చని నిరూపించాడీ హీరో . కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను ఫిదా చేశారు. విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ కావల్సినంత వినోదాన్ని పంచుతున్నారు సంపూర్ణేష్ బాబు.

అయితే సంపూర్ణేశ్ నటించిన ‘హృదయకాలేయం’ ‘కొబ్బరిమట్ట’ వంటి చిత్రాలు మంచి వసూళ్లనే రాబట్టాయి కూడా . ఈ చిత్రాల తర్వాత సంపూర్ణేశ్ కి కూడా ఓ మార్కెట్ ఏర్పడింది. యూట్యూబ్ లోనూ ఆయన సినిమాలకు భారీ వ్యూస్ వస్తుంటాయి. ఆయన ఇంటర్వ్యూలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. కరోనా అనంతరం సంపూర్ణేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. అంతేకాదు ప్రస్తుతం ఈ బర్నింగ్ స్టార్ ‘ బజార్ రౌడీ ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని కేఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా.. వసంత నాగేశ్వరరావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంపూర్ణేశ్ కి జోడీగా మహి నటిస్తోంది. షాయాజీ షిండే ..30 ఇయర్స్ పృథ్వీ.. నాగినీడు.. షఫి.. జీవా.. సమీర్.. మణిచందన.. నవీన.. పద్మావతి ..కత్తి మహేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలకు ప్రముఖ కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్యాలు సమకూరుస్తున్నారు.ప్రస్తుతం ఆయన నేతృత్వంలో పాటలను చిత్రీకరిస్తున్నారు. తెలుగు సినిమాల్లో స్టార్ హీరోస్ అల్లు అర్జున్.. రామ్ చరణ్ ..ఎన్టీఆర్.. రామ్ వంటి వారి డ్యాన్సర్లకు స్టెప్ లు కంపోజ్ చేసే ప్రేమ్ రక్షిత్ సంపూర్ణేష్ సినిమాకు పని చేయడం విశేషమే.

ప్రస్తుతం రామోజీఫిల్మ్సిటీలో ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో దాదాపు 20 మంది డాన్సర్లతో కలిసి సంపూర్ణేశ్ బాబు హీరోయిన్ మహితో స్టెప్పులు వేస్తున్నాడు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. మా నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. మిగతా టీం కూడా ఎంతో ప్లాన్ తో షెడ్యూల్ వేసుకొని సినిమా తీస్తున్నాం. అతి తర్వలో ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తాం. మరుధూరి రాజా సంభాషణలు బుల్లెట్లలా ఉన్నాయని డైరెక్టర్ తెలిపాడు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle