ఆరడుగుల హీరోలతో సాయిపల్లవి.. హైట్ నో మ్యాటర్
21-01-202121-01-2021 09:28:35 IST
Updated On 21-01-2021 10:19:14 ISTUpdated On 21-01-20212021-01-21T03:58:35.826Z21-01-2021 2021-01-21T03:40:16.513Z - 2021-01-21T04:49:14.537Z - 21-01-2021

హీరోయిన్ అంటే ఒడ్డూ..పొడుగూ అన్నీ కరెక్ట్ గా ఉంటేనే హీరోయిన్ అనే దానికి అర్థం మారిపోతోంది..షార్ట్ గా ఉన్నవారు వెండితెరను ఏలేస్తున్నారు. నిత్యామీనన్..సాయిపల్లవి..అలా షార్ట్ గా ఉన్నవారి లిస్ట్ లోకి వస్తారు. ఇంకో విషయం ఏంటంటే వీరు పొట్టిగా ఉన్నా వీరు యాక్ట్ చేసే హీరోలు దాదారు ఆరడుగులు ఉండటం విశేషం. అసలు హీరో హైట్ ని దృష్టిలో పెట్టుకునే హీరోయిన్ ని సెట్ చేస్తారు దర్శక..నిర్మాతలు. కానీ సాయిపల్లవి విషయంలో అంతా రివర్స్ జరుగుతోంది. సాయిపల్లవి హైటు తక్కువ .. యంగ్ హీరోస్ నానీ.. శర్వానంద్ వంటి మీడియం హైట్ హీరోల జోడీగా ఆమె బాగుంటుంది. కానీ తెలుగులో తన తొలి సినిమానే ఆమె ఆరడగుల అందగాడైన వరుణ్ తేజ్ తో చేయడం విశేషం. అయితే ఆ సినిమా కథాకథనాలు .. నేపథ్యాలు .. పాత్రలను మలిచిన తీరు కారణంగా ఎవరూ ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు .. ఎక్కడా అదో లోపంగా అనిపించలేదు. ఆ సినిమాకి ఇటు యూత్ తో పాటు అటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పట్టారు. రీసెంట్ గా సాయిపల్లవి హీరో రానా సినిమా అయిన 'విరాటపర్వం'లోను నటించింది. రానా హైట్ కూడా ఆరడగుల పైమాటే. ఇద్దరి పాత్రల మధ్య సంబంధం ఏమిటి.. పాటలు ఉంటాయా .. పాడుకుంటారా.. అనే విషయాలు తెలియదుగానీ రానా జోడీగా ఈ అమ్మాయి సెట్ అవుతుందా.. అనే సందేహం మాత్రం అభిమానులకు కలిగింది. ఒకవేళ ఈ సినిమాలో ఈ ఇద్దరూ ప్రేమికులు కారేమోనని అనుకుంటే గోపీచంద్ జోడీగా ఈ అమ్మాయిని తీసుకున్నారనే టాక్ తాజాగా వినిపిస్తోంది.గోపీచంద్ హీరోగా దర్శకుడు తేజ 'అలమేలుమంగ - వెంకటరమణ' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో నాయిక పాత్ర కోసం సాయిపల్లవిని ఎంపిక చేశారని అంటున్నారు. గోపీచంద్ మంచి హైట్ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇలా అగ్గిపుల్లవంటి ఈ పిల్లకి ఆరడుగులున్నర హీరోల పక్కనే అవకాశాలు వెతుక్కునీ మరీ వస్తుండటం విశేషం. ఆమె హైట్ పెద్ద సమస్య కాదనుకోవడం మరో విశేషం. టాలెంట్ ఉండబట్టే హైట్ ని పెద్దగా పట్టించుకోవడం లేదట దర్శక..నిర్మాతలు.

సినిమా ఏకీ నంబర్.. రెమ్యునరేషన్ ఏకీ క్రోర్
18 hours ago

విజయశాంతిలా ఇష్యూ చేస్తున్న సమంత
20 hours ago

అన్నదమ్ముల బాక్సాఫీస్ ఫైట్.. నెగ్గేది ఎవరు..? తగ్గేది ఎవరు..?
07-03-2021

ఈ సినిమా వాళ్లకి దొబ్బేసే అలవాటు ఎప్పుడు పోతుంది
07-03-2021

జాతిరత్నంతో అనుష్క రొమాన్స్
07-03-2021

భీష్మ డైరెక్టర్ ని ఎలా బురిడీ కొట్టించాడు.. మొత్తం కథ
05-03-2021

నాని సినిమాపై హాట్ బేబీ కంప్లైంట్.. ఆపేయాలన్న బాంబే హైకోర్టు
05-03-2021

ప్రదీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత క్యూ
04-03-2021

బాలయ్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి
03-03-2021

హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యారవ్యాన్ లో ఏం జరుగుతోంది
03-03-2021
ఇంకా