newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

సాయి ధరమ్ తేజ్ బర్త్ డే.. సాంగ్ రిలీజ్ చేసిన మెగాస్టార్

15-10-202015-10-2020 14:33:30 IST
2020-10-15T09:03:30.042Z15-10-2020 2020-10-15T09:03:27.610Z - - 21-10-2020

సాయి ధరమ్ తేజ్ బర్త్ డే.. సాంగ్ రిలీజ్ చేసిన మెగాస్టార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేడు(అక్టోబర్ 15)యంగ్ హీరో సాయి ధరమ్  తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాస్టార్  చిరంజీవి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం  నుంచి 'అమృత' అనే సాంగ్ రిలీజ్ చేశాడు. 'హ్యాపీ బర్త్ డే డియర్ తేజ్. 'సోలో'గా ఉన్నప్పుడే ఫుల్ గా ఎంజాయ్ చేసేయ్. నీ 'సోలో' లైఫ్ ఇంకొన్ని రోజులే' అని చిరంజీవి ట్వీట్ చేశాడు. కాగా మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక పెళ్లి రీసెంట్ గా జరగనుంది. ఈమె పెళ్లి తర్వాత సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరగనుందని టాక్.

కాగా సాయి ధరమ్ తేజ్ తన మామయ్య చిరంజీవి చెప్పిన  బర్త్ డే విషెస్ కి ధన్యవాదాలు తెలిపాడు. ''ఇదే ఎవరైనా కోరుకునే బెస్ట్ బర్ డే గిఫ్ట్. ఈ రోజును మరింత ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు మామ.. లవ్ వ్యూ సో మచ్. మీ ఆశీర్వాదం తప్ప మరేమీ అడగలేను. థాంక్యూ సో మచ్ మామా'' అని తేజ్ ట్వీట్ లో తెలియజేశారు. మామ మెగాస్టార్ విషెస్ కి ఉబ్బితబ్బిబయ్యాడు తేజ్.

కాగాసుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో తేజ్ 'ప్రస్థానం' దేవా కట్ట దర్శకత్వంలో ఓ సినిమాని స్టార్ట్ చేసాడు. దీంతో పాటు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. అంతేకాకుండా గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడితో తేజ్ 'భగవద్గీత సాక్షిగా' అనే ప్రాజెక్ట్ ని  లైన్ లో పెట్టారని వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నాడు. గతేడాది చివరిలో  `ప్రతి రోజూ పండగే` సినిమాతో విజయం అందుకున్న మెగా హీరో సాయితేజ్ నటిస్తున్న తాజా చిత్రం `సోలో బ్రతుకే సో బెటరు`. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle