newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్.. జక్నన్నా.. ఇది నిజమేనా..?

29-09-202029-09-2020 13:50:31 IST
Updated On 29-09-2020 13:59:09 ISTUpdated On 29-09-20202020-09-29T08:20:31.981Z29-09-2020 2020-09-29T08:20:30.047Z - 2020-09-29T08:29:09.770Z - 29-09-2020

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్.. జక్నన్నా.. ఇది నిజమేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సంచలన చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి నందమూరి అభిమానులు, మెగా అభిమానులు మాత్రమే కాకుండా... సామాన్య  ప్రేక్షకుల్లో సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి ఏర్పడింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య ఈ సినిమాని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

ఇందులో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో  రామ్‌చ‌ర‌ణ్.. కొమురంభీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండు నిజమైన చారిత్ర‌క పాత్రల క‌ల్పిత‌గాథే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తుంటే.. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో క్లారిటీ లేని పరిస్థితి. దీంతో నందమూరి అభిమానులు, మెగా అభిమానులు ఆర్ఆర్ఆర్ గురించి క్లారిటీ ఇవ్వాలంటూ జక్కన్న పై ఒత్తిడి చేస్తున్నారు. అయితే... ఈ మూవీని ముందు ఈ ఏడాది జూలై 30న విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ.. కుదరలేదు.

ఆతర్వాత 2021లో జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేస్తామ‌ని అఫిషియల్ గా ఎనౌన్స్ చేసారు. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ వస్తుందని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడంతో మిగిలిన హీరోలు అందరూ తమ సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకున్నారు. ఎందుకంటే... ఆర్ఆర్ఆర్ పోటీలో ఉంటే... ఏ సినిమాని అయినా ఆడియన్స్ పట్టించుకోరు. ఈ విషయం బాగా తెలసు కాబట్టే మిగిలిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు సంక్రాంతికి తమ సినిమా రిలీజ్ చేయకూడదని డిసైడ్ అయ్యారు. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ రావడం పక్కా... అంతా ఓకే అనుకుంటుంటే... కోవిడ్ ఎఫెక్ట్ స్టార్ట్ కావ‌డంతో షూటింగ్స్ అన్నీ ఆగాయి. ఆరు నెల‌లు దాటిన‌ప్ప‌టికీ యూనిట్ షూటింగ్ స్టార్ట్ కాలేదు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలిసింది.

ఇదిలా ఉంటే.... ఆర్ఆర్ఆర్ మూవీని  జూలై 30, 2021లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దీంతో ఇది నిజమేనా..? కాదా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి.. జక్కన్న క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle