newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

R R R మూవీకి అస‌లు బ‌లం ఏంటో తెలుసా

18-10-202018-10-2020 16:11:25 IST
Updated On 18-10-2020 16:31:44 ISTUpdated On 18-10-20202020-10-18T10:41:25.351Z18-10-2020 2020-10-18T10:41:17.417Z - 2020-10-18T11:01:44.491Z - 18-10-2020

R R R మూవీకి అస‌లు బ‌లం ఏంటో తెలుసా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రాజ‌మౌళి అంటే ఆ లెక్క వేరే. జ‌క్క‌న్న చెక్కితే.. ఆ మూవీ ఎలా ఉంటుందో ఎవ‌రికీ చెప్పాల్సిన ప‌న్లేదు. నేష‌న‌ల్ వైడ్ గా ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే.. ఆయ‌నంటే అంతిష్టం ఆడియ‌న్ కి. వాటికి తోడు.. మాస్ నాడి ప‌ట్టుకోవ‌డంలో కూడా జ‌క్క‌న్న స్టైలే వేరు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా.. అద్దిరిపోయే హీరోయిజం చూపిస్తాడు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ మూవీలో కూడా అదే ఫీల్ అవుతున్నాట్ట‌. సినిమా అంటే హీరోయిజం.. హీరోయిజం అంటే త్రిబుల్ ఆర్ మూవీ అనేలా చేస్తున్నాట్ట‌.

మెయిన్ గా యాక్ష‌న్ సీన్ల‌పై ఫోక‌స్ చేసిందంట త్రిబుల్ ఆర్ మూవీ టీమ్. రాజ‌మౌళి కూడా ఈ విష‌యంపై చాలా క్లియ‌ర్ గా ఉన్నాడ‌ట‌. ఈ మ‌ధ్య కేజీఎఫ్ మూవీ యాక్ష‌న్ సీన్ల‌కి ఏ రేంజ్ అప్లాజ్ వ‌చ్చిందో చూశాం కదా. కేజీఎఫ్ లో కథ‌, కంటెంట్ అంటూ అన్నీ ఉన్నా.. యాక్ష‌న్ సీన్లు అన్నీటిని మింగేశాయి. అందుకే.. ఆ యాక్ష‌న్ సీన్ల‌ని ఇంకా మర్చిపోలేం. ఇక రాజ‌మౌళి సినిమాల్లో ఉండే యాక్ష‌న్ సీన్లు కూడా త‌క్కువేం కాదు. బాహులి అంటే వేరే జాన‌ర్.. రాజులు యుద్ధాలు చూపించాడు.

పాత సినిమాల్ని మైండ్ లోకి తెచ్చుకుంటే.. చ‌త్ర‌ప‌తి, సింహాద్రి మూవీస్ లో యాక్ష‌న్ సీన్లు దుమ్ములేపాయి. రాజ‌మౌళి బ్రాండ్ ఆయుధాలు వేరే ఉంట‌య్. అలాంటి జ‌క్క‌న్న మ‌ళ్లీ యాక్ష‌న్ సీన్ల‌పై ఫోక‌స్ చేశాడంటే ఇక ఏ రేంజ్ లో ఉంటాయో ఆలోచించండి. అదీ కాక‌.. ఇద్ద‌రు బ‌డా స్టార్లు.. వాళ్ల‌కి అపొనెంట్లు కూడా అదే రేంజ్ లో స్టార్లు. బ‌య‌టికి వ‌చ్చిందంటే దుమ్ములేచిన‌ట్లే. అందుకే.. యాక్ష‌న్ సీన్ల లెక్క వేరే ఉంటుంది అనే టాక్ ఆల్రెడీ బ‌య‌టికొచ్చింది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle