newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

డేటింగ్ లో 'రిచా చద్దా..ఫజల్'..జుహులో అద్దెకు బంగ్లా..

18-10-202018-10-2020 15:46:50 IST
2020-10-18T10:16:50.902Z18-10-2020 2020-10-18T10:16:48.305Z - - 30-10-2020

డేటింగ్ లో 'రిచా చద్దా..ఫజల్'..జుహులో అద్దెకు బంగ్లా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిత్యం ఏదో ఒక వివాదంలో నిలుస్తుంది బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా. లేటెస్ట్ గా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. ఈ భామ డేటింగ్ లో ఉందట.  తన లవర్ పేరు అలీ ఫజల్. అతడు 6ప్యాక్ కండరగండడిగా ఇప్పటికే పాపులర్. అయితే ఈ ప్రేమజంట ఇటీవల జుహులో ఒక బంగ్లాను అద్దెకు తీసుకున్నారు. ముంబైలోని అత్యంత అనుకూలమైన ప్రదేశాలలో ఉన్న ఈ బంగ్లాలో నెలకు భారీగా అద్దె చెల్లించాల్సి ఉంటుందట. ఇంతకీ ఎంత చెల్లిస్తున్నారో తెలుసుకుందాం.

జుహుకు చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ 2020 సెప్టెంబర్ 30 న ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 15 రోజుల క్రితం బంగ్లాను వెతికి అడ్వాన్స్ ఇచ్చారు. జుహు అంటేనే బాలీవుడ్ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు ఉండే ఏరియా. అక్కడ ఒక ఉన్నతస్థాయి సమాజంలో బంగ్లా నంబర్ 4 ను అద్దెకు తీసుకున్నారు. వారు 36 నెలల కాలానికి బంగ్లాను అద్దెకు తీసుకున్నారట. అంటే మూడు సంవత్సరాలకు అన్నమాట. మొదటి సంవత్సరానికి అద్దె నెలకు రూ .3 లక్షలు.. రెండవ సంవత్సరానికి నెలకు రూ .3.15 లక్షలు .... చివరి సంవత్సరానికి నెలకు రూ .3.30 లక్షలు చెల్లించాలనేది ఒప్పందం. అద్దెకు తీసుకున్న బంగ్లా కోసం రూ .10 లక్షల డిపాజిట్ చెల్లించారట.

ఇక ఇక్కడ అద్దెకు తీసుకున్నవారిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు. జూన్ లో హృతిక్ రోషన్ జుహులో ఒక అపార్ట్మెంట్ నిఅద్దెకు తీసుకున్నాడు. 3928 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ కు హృతిక్ నెలకు రూ .8.25 లక్షల అద్దె చెల్లిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో వరుణ్ ధావన్ తల్లిదండ్రులు కరుణ -డేవిడ్ దంపతులు కూడా  జుహులోని కొన్ని దుకాణాలను అద్దెకు తీసుకున్నారట. నెలకు 3 లక్షలు పైగా అద్దె అంటే ఆషామాషీనా? అసలే సినిమా షూటింగుల్లేవ్ అంటారా? అయినా ఫేజ్ 3 కపుల్ కి ఇదేమీ పెద్ద మొత్తమేమీ కాదు. సినిమా ఆఫీస్ అద్దెలా ఇంటి అద్దె  చెల్లిస్తున్న ప్రేమ జంట వరుస కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నవారే కావడంతో సంపాదనకు కొదవేమీ లేదట. కాస్ట్ లీ ప్రేమ అన్నమాట.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle