newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

వ‌ద‌లం బొమ్మాళీ వ‌ద‌లం.. దండాలు పెట్టినా వ‌ద‌లం డ్ర‌గ్స్ బేబీ

21-01-202121-01-2021 07:58:05 IST
Updated On 21-01-2021 11:45:25 ISTUpdated On 21-01-20212021-01-21T02:28:05.581Z20-01-2021 2021-01-20T17:51:30.554Z - 2021-01-21T06:15:25.375Z - 21-01-2021

వ‌ద‌లం బొమ్మాళీ వ‌ద‌లం.. దండాలు పెట్టినా వ‌ద‌లం డ్ర‌గ్స్ బేబీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇవ‌న్నీ ముందే ఉండాలి. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఒక‌లా.. ఇంకొక‌డు దొరికిన‌ప్పుడు ఇంకోలా.. డ్ర‌గ్స్ మ‌త్తులో ఉండి.. నిండు మ‌న‌సుతో ప్రేమించినోళ్ల‌ని లెక్క చేయ‌క‌పోతే.. ఇట్టాగే దండాలు ద‌స్కాలు పెట్టాల్సి వ‌స్తుంది. నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకున్న‌ది కాక‌.. సూడ‌మ్మా స‌క్క‌న‌మ్మ దండాలు పెడుతోంది. ఈమెకి గ‌నం అందం ఉంద‌ని.. ఎగిరెగిరి ప‌డి.. జైలుకి పొయ్యొచ్చింది. ఇప్పుడేమో.. వచ్చాన‌మ్మా వ‌య్యారిని.. నా ఫోటోలు తియ్య‌కండీ అని దండాలు పెడుతోంది..అంటూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. అభిమానులు తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్నారు.

రియా చ‌క్ర‌వ‌ర్తి అంటే ఎవ‌రికి తెలుసో ఎవ‌రికి తెలీదో కానీ.. ముంబై డ్ర‌గ్స్ బేబీ అంటే చాలు.. అంద‌రికీ తెలుసు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గ‌ర్ల్ ఫ్రెండ్ గా కూడా బాగా ఫేమ‌స్. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చ‌నిపోవ‌డానికి రియానే కార‌ణం అంటూ.. ఎంత ర‌చ్చ అయిందో చూశాం క‌దా.  జైలుకి కూడా పోయొచ్చింది క‌దా వ‌య్యారీ. అమ్మ‌గారు జైలుకి పొయ్యాక ఏం జ‌రిగిందో తెలిసిందే క‌దా. ముంబై ఫిల్మ్ ఇండ‌స్ట్రీ మొత్తం షేక్ అయ్యింది. డ్ర‌గ్స్ కేసులో ఎంతో మంది సెల‌బ్రిటీల పేర్లు బ‌య‌టికొచ్చాయి. కొన్నాళ్ల‌కి జైలు బ‌య‌టికొచ్చింది క‌దా బొమ్మాళి. అప్ప‌టి నుంచి.. పెద్ద‌గా ఇంటి బ‌య‌టికి రావ‌డం లేదు. ఓ సారి.. ఒకానొకాయ‌న‌ కొడుకు ఫంక్ష‌న్ లో తండ్రితో సూప‌ర్ క్లోజ్ గా ఉన్న బొమ్మ బ‌య‌టికి రావ‌డంతో బొమ్మాళీని బొమ్మాట ఆడుకున్నారు. 

అంతే.. ఆ రోజు నుంచి గ‌ప్ చుప్. నా జీవిత కాలం ఇలానే ఉండాల్నారా బాబూ అనుకుంటూ ఉండిపోయింది. ముంబై రోడ్ల మీద తిరిగే స్పేస్ త‌గ్గిపోయింది బేబీకి. స‌డ‌న్ గా ఇపుడు రోడ్డుమీద తుర్రున దిగింది. పూల బొక్కే కొనాల‌ని ఫుట్ పాత్ ఎక్కింది. మ‌రి షాపింగు మాల్స్ లో కొనే టైం లేదో ఇంట్ర‌స్ట్ లేదో కానీ.. దిగేసింది. అమ్మ‌గారు బాగా ఫేమ‌స్ అయ్యారు క‌దా. అంతే.. జ‌నాలు గుర్తు ప‌ట్టేసి.. కెమెరాలు ఆన్ చేశారు. ఈ సుంద‌రాంగి ఎటు తిరిగితే.. కెమెరాలు అటు తిరిగాయి. ఇక త‌ట్టుకోలేక ప్లీజ్ న‌న్ను వ‌దిలేయండి అంటూ దండాలు పెట్టుకుంటూ కారెక్కేసింది. ఇక్క‌డ ఇంకో పాయింట్ ఏంటంటే.. ఇవ్వాళ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ‌ర్త్ డే. అదేనండీ జ‌యంతి. ఈ టైంలో పాపగారు పూల బొకే కొన‌డం ఇంకాస్త ఇంట్ర‌స్టింగ్ గా మారింది. మ‌రి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంటే ఇష్టం లేక‌నో ఏమో.. ఏదో షో చేయ‌డానికి రోడ్డు ప‌క్క‌న చీప్ గా బొకే కొన్న‌ది కావ‌చ్చు అంటున్నారు. ప్రేముంటే క‌దా అనేది ఇంకో కామెంట్. ఏదెట్టా ఉన్నా.. రియాకి ఈ శిక్ష జీవిత‌కాలం త‌ప్ప‌దేమో.

సినిమా ఏకీ నంబ‌ర్.. రెమ్యున‌రేష‌న్ ఏకీ క్రోర్

సినిమా ఏకీ నంబ‌ర్.. రెమ్యున‌రేష‌న్ ఏకీ క్రోర్

   18 hours ago


విజ‌య‌శాంతిలా ఇష్యూ చేస్తున్న స‌మంత

విజ‌య‌శాంతిలా ఇష్యూ చేస్తున్న స‌మంత

   20 hours ago


అన్న‌ద‌మ్ముల బాక్సాఫీస్ ఫైట్.. నెగ్గేది ఎవ‌రు..? త‌గ్గేది ఎవ‌రు..?

అన్న‌ద‌మ్ముల బాక్సాఫీస్ ఫైట్.. నెగ్గేది ఎవ‌రు..? త‌గ్గేది ఎవ‌రు..?

   07-03-2021


ఈ సినిమా వాళ్ల‌కి దొబ్బేసే అల‌వాటు ఎప్పుడు పోతుంది

ఈ సినిమా వాళ్ల‌కి దొబ్బేసే అల‌వాటు ఎప్పుడు పోతుంది

   07-03-2021


జాతిర‌త్నంతో అనుష్క రొమాన్స్

జాతిర‌త్నంతో అనుష్క రొమాన్స్

   07-03-2021


భీష్మ డైరెక్ట‌ర్ ని ఎలా బురిడీ కొట్టించాడు.. మొత్తం క‌థ

భీష్మ డైరెక్ట‌ర్ ని ఎలా బురిడీ కొట్టించాడు.. మొత్తం క‌థ

   05-03-2021


నాని సినిమాపై హాట్ బేబీ కంప్లైంట్.. ఆపేయాలన్న బాంబే హైకోర్టు

నాని సినిమాపై హాట్ బేబీ కంప్లైంట్.. ఆపేయాలన్న బాంబే హైకోర్టు

   05-03-2021


ప్ర‌దీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత‌ క్యూ

ప్ర‌దీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత‌ క్యూ

   04-03-2021


బాల‌య్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి

బాల‌య్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి

   03-03-2021


హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యార‌వ్యాన్ లో ఏం జ‌రుగుతోంది

హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యార‌వ్యాన్ లో ఏం జ‌రుగుతోంది

   03-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle