newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

అంజలి అంజలి సాంగ్ రీ క్రియేషన్ లో అల్లు 'అర్హ' అదరహో

21-11-202021-11-2020 19:47:05 IST
2020-11-21T14:17:05.338Z21-11-2020 2020-11-21T14:16:57.172Z - - 06-12-2020

అంజలి అంజలి సాంగ్ రీ క్రియేషన్ లో అల్లు 'అర్హ' అదరహో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పలువురు స్టార్స్ పిల్లలు చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు..అంతేకాదు వారికంటూ సొంతంగా యూట్యూబ్  ఛానెల్స్ ని క్రియేట్ చేసుకుని తమ సత్తాని చాటుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహశ్ బాబు గారాల పట్టీ సితార యూట్యూబ్ ఛానెల్ లో సందడి చేస్తుంది. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హ కూడా యూట్యూబ్ ఛానెల్ లో సందడి చేసేందుకు సమయం ఆసన్నమైంది.  అవును.. అల్లు వారి అల్లరి పిడుగు బరిలో దిగుతోంది.  అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ తన తొలి ప్రదర్శనకు సిద్ధంగా ఉంది. అల్లు అర్హా ప్రత్యేక కవర్ సాంగ్ లో పెర్ఫామ్ చేసింది.

మణిరత్నం 1990 క్లాసిక్ `అంజలి`లోని క్లాసిక్ సాంగ్ ‘అంజలి అంజలి’ లో కనిపిస్తుంది. బేబీ అర్హా ఈ పాపులర్ సాంగ్ లో బేబీ షామిలిని రిప్రైజ్ చేసింది. కవర్ సాంగ్ అదిరిపోయే లా వచ్చింది కూడా. ఈ పాటకు సినిమాటోగ్రాఫర్ సూర్య తేజ ముసునూరు ఛాయాగ్రహణం అందించారు. అర్హ విజువల్స్ ని అద్భుతంగా తీర్చిదిద్దారని తనని ఎంతో క్యూట్ గా ప్రెజెంట్ చేశారని తెలుస్తోంది. అల్లు వారసురాలు అర్హ ఆ పాటలో ఎంతో తేలిగ్గా ఎమోషన్స్ ని పలికించిందని కామెంట్స్ వస్తున్నాయి. సహజంగానే అర్హా నృత్యం.. ముఖ కవళికలు.. భావోద్వేగాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. డాడీ వారసురాలిగా అర్హ డ్యాన్సులు చక్కగానే చేస్తోంది. అందుకే ఈ సాంగ్ పై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే పాటను బ్రిలియంట్ గా తీర్చిదిద్దారు.

దర్శకుడు  మణిరత్నం 1990 క్లాసిక్ `అంజలి` మూవీలోని క్లాసిక్ సాంగ్ ‘అంజలి అంజలి’ సాంగ్ మ‌నందరికి గుర్తుండే ఉంటుంది. ఇళ‌య‌రాజా సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ సాంగ్‌లో బేబి ష్యామిలీ క‌నిపించి అల‌రించింది. ఇప్పుడు ఇదే సాంగ్ అల్లు అర్జున్ కూతురు రిప్రైజ్ చేసింది. ఈ రోజు అర్హ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రీక్రియేష‌న్‌కి సంబంధించిన  సాంగ్ విడుద‌ల చేశారు.  

అల్లు వారసురాలు అర్హ ఆ పాటలో ఎంతో తేలిగ్గా ఎమోషన్స్ ని పలికించింది. ముఖ క‌వ‌ళిక‌లు, భావోద్వేగాలు అద‌ర‌హో అనిపిస్తున్నాయి. అల్లు అర్హతో పాటు ఆమె సోదరుడు అల్లు అయాన్‌, తాతయ్యలు అల్లు అరవింద్‌, కేసీ శేఖర్‌ రెడ్డి సహా అల్లు అర్జున్‌ కూడా నటించడం విశేషం. ఈ పాటకు సినిమాటోగ్రాఫర్ సూర్య తేజ ముసునూరు ఛాయాగ్రహణం అందించారు. అర్హ విజువల్స్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అభిమానుల అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గకుండా ఉన్న ఈ సాంగ్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.  

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle