newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

రవితేజ క్రాక్ తర్వాత స్టార్ట్ చేసే సినిమా ఇదే

17-10-202017-10-2020 09:30:29 IST
Updated On 17-10-2020 11:15:38 ISTUpdated On 17-10-20202020-10-17T04:00:29.527Z17-10-2020 2020-10-17T04:00:24.547Z - 2020-10-17T05:45:38.214Z - 17-10-2020

రవితేజ క్రాక్ తర్వాత స్టార్ట్ చేసే సినిమా ఇదే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన అందాల తార శృతిహాసన్ నటిస్తుంది. టీజర్ కు మంచి స్పందన రావడంతో సినిమా పై టీమ్ మంచి నమ్మకంతో ఉన్నారు. ఈ మూవీ ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే... రవితేజ కొత్త సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.

అయితే... రవితేజ వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఓ వైపు రమేష్‌ వర్మ సినిమాను ఎప్పుడో ఓకే చేసారు. రీసెంట్ గా మారుతి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు మరో రెండు మూడు సినిమాలకు సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి. దీంతో క్రాక్ మూవీ తర్వాత ఏ సినిమా స్టార్ట్ చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది. అయితే... ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఈ నెల 18న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేయనున్నారని.... అందుకే ఆయనకు జోడీగా రాశీఖన్నా, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించనున్నారని సమాచారం.

డైరెక్టర్ రమేష్ వర్మతో రవితేజ వీర అనే సినిమా చేసారు. ఈ సినిమా సక్సస్ సాధించలేదు. రాక్షసుడు సక్సస్ తర్వాత రమేష్‌ వర్మ చేస్తున్న సినిమా ఇది. మరి.. ఈ సినిమాతో అయినా.. రవితేజ, రమేష్‌ వర్మ సక్సస్ సాధిస్తారేమో చూడాలి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle