newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

రవితేజ సినిమా ప్రారంభానికి ముందే ఇన్ని వార్తలా..?

12-06-202112-06-2021 19:41:58 IST
2021-06-12T14:11:58.853Z12-06-2021 2021-06-12T14:11:51.277Z - - 25-07-2021

రవితేజ సినిమా ప్రారంభానికి ముందే ఇన్ని వార్తలా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రస్తుతం కరోనా వేవ్ కారణంతో ప్రధాన రంగాలన్నీ చాలా తీవ్రంగా నష్టపోయాయన్న విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే.. ఇందులో రియల్ ఎస్టేట్, రంగం తో పాటు సినిమా రంగం కూడా భారీ కుదుపులకు గురయ్యింది. కరోనా వైరస్ కట్టడికోసం ప్రభుత్వాలు లాక్ దౌన్ విధించడంతో సినిమా షూటింగులు నిలిచిపోవడం, థియేటర్ లు మూతపడి పోవడంతో ఎంతో మంది సినీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఎదురయ్యంది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ సెకండ్ వేవ్ నుండి కాస్త కోలుకోవడం జరుగుతుండడంతో జూలై నెల నుండి సినిమా షూటింగులు జరుగుతాయని తెలుస్తోంది. 

అయితే రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరున  ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా పై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాని ఆపేసారని, కథలో మార్పులు జరుగుతున్నాయని, షూటింగ్‌ ఇప్పట్లో మొదలు కాదని, అసలు సినిమా ఉంటుందో లేదో కూడా క్లారిటీ లేదని రకరకాల వార్తలు పుట్టుకువచ్చాయి.. అయితే ఈ వార్తలని ఖండించడానికి డైరెక్టర్ శరత్ మండవ రంగంలోకి దిగారు. ఈ సినిమా టైటిల్‌ ఫుల్‌ మాస్‌గా, ఫస్ట్‌ లుక్‌ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంటాయి. ఇక ఈ మూవీ థీమ్‌ సాంగ్‌ అయితే ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. వచ్చే నెలలో షూటింగ్‌ ఆరంభించే చాన్స్‌ ఉంది. ఆ తర్వాత మా సినిమా గురించి కొన్ని అప్‌డేట్స్‌ ఇస్తాం’’ అని శరత్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ సంవత్సరం క్రాక్ చిత్రంతో రవితేజ ఫుల్ ఫాం లోకి వచ్చారు. క్రాక్ ఇచ్చిన సక్సెస్ జోష్ లో రవితేజ మంచి కథలకి ఒకే చెబుతూ ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. 

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

   9 hours ago


నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

   9 hours ago


హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

   a day ago


Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

   a day ago


ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

   24-07-2021


రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

   24-07-2021


ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

   24-07-2021


తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

   23-07-2021


బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

   23-07-2021


నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

   23-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle