newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

రవితేజ న్యూమూవీ టైటిల్ ఖిలాడి. షూటింగ్ ఎప్పుడు..?

18-10-202018-10-2020 14:02:36 IST
Updated On 18-10-2020 14:13:08 ISTUpdated On 18-10-20202020-10-18T08:32:36.407Z18-10-2020 2020-10-18T08:32:21.505Z - 2020-10-18T08:43:08.989Z - 18-10-2020

రవితేజ న్యూమూవీ టైటిల్ ఖిలాడి. షూటింగ్ ఎప్పుడు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం క్రాక్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మతో ఓ సినిమా, మారుతితో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే... ఎవరితో ముందుగా సినిమా చేస్తారో అనేది సస్పెన్స్ గా ఉండేది. ఈరోజు రమేష్‌ వర్మతో చేయనున్న సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసారు. ఈ చిత్రానికి ఖిలాడి అనే టైటిల్ ఖరారు చేసారు.

ఈరోజు ఉదయం 11.55 నిమిషాలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ చిత్రానికి ఖిలాడి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ప్లే స్మార్ట్ అనే ట్యాగ్ లైన్ పెట్టి అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ముందుగానే ఆశ్చర్యపరిచారు. అలాగే ఈ పోస్టర్ లో కరెన్సీ నోట్లు చూస్తుంటే టైటిల్ కు తగ్గట్టుగానే ఒక స్మార్ట్ దొంగ రోల్ లో రవితేజ కనిపిస్తారనిపిస్తుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే... ఈ మూవీ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. మరో విషయం ఏంటంటే... ఇందులో రవితేజ డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తారని తెలిసింది.

 ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయతిలు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కోనేరు వంశీ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle