newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

'కీర్తి సురేష్' బర్త్ డేకి 'రంగ్ దే' ఫస్ట్ లుక్..

17-10-202017-10-2020 17:16:02 IST
2020-10-17T11:46:02.765Z17-10-2020 2020-10-17T11:45:59.587Z - - 26-10-2020

'కీర్తి సురేష్' బర్త్ డేకి 'రంగ్ దే' ఫస్ట్ లుక్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహానటి చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకుల మన్నలను అందుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ బ్యూటీ బర్త్ డే నేడు (అక్టోబర్ 17). కాగా యంగ్ హీరో  నితిన్ - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''రంగ్ దే''.  కీర్తి సురేష్ పుట్టినరోజు సంధర్భంగా ఈ  చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ 'రంగ్ దే' నుంచి కీర్తి కి సంబంధించిన ఓ పోస్టర్ ని  విడుదల చేశారు. ఈ ఫొటోలో చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో ఉన్న కీర్తి అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇటీవలే కొద్ది విరామం తరువాత ఈ  చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. హీరో.. హీరోయిన్లు నితిన్ - కీర్తి సురేష్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నెల చివరి వారంలో చిత్రానికి సంబంధించిన మరికొన్ని సన్నివేశాలు మరియు ఇటలీలో పాటల చిత్రీకరణతో కొద్ది రోజులలోనే షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. కాగా నితిన్ - కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్.వెంకటరత్నం(వెంకట్) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

'తొలిప్రేమ' 'మిస్టర్ మజ్ను' వంటి ప్రేమకథా చిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి 'రంగ్ దే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ - వినీత్ - రోహిణి - కౌసల్య - బ్రహ్మాజీ -వెన్నెల కిషోర్ - సత్యం రాజేష్ - అభినవ్ గోమటం - సుహాస్ - గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

నేటితో కీర్తి 29వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు .. కీర్తికి బర్త్ డే విషెస్ చెప్పాడు.  మహేష్, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న `సర్కారు వారి పాట` సినిమాలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ విషయాన్ని కూడా మహేష్ కన్ఫామ్ చేశాడు. `టాలెంటెడ్‌ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. `సర్కార్‌ వారి పాట` టీమ్ మీకు స్వాగతం పలుకుతోంది. ఈ సినిమా కచ్చితంగా మీ కెరీర్‌లో ఒక మంచి జ్ఞాపకంగా నిలుస్తుందని మహేష్‌ ట్వీట్ చేశాడు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle