newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్ చ‌ర‌ణ్

13-09-202113-09-2021 15:13:57 IST
2021-09-13T09:43:57.607Z13-09-2021 2021-09-13T09:43:54.944Z - - 17-10-2021

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్ చ‌ర‌ణ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ తెలుగు వెర్షన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సంతకం చేసినట్లు తెలుస్తోంది. రెండు ప్రకటనలతో పాటు ప్రింట్‌ యాడ్స్‌లో చేసేందుకు రామ్‌ చరణ్‌ రూ. 3 కోట్లు డిమాండ్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి‌. ఇందుకు సదరు సంస్థ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందంపై హాట్‌స్టార్‌ చెర్రి గత ఏడాది నుంచి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలో ఆచార్య, ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల ఉండటంతో తమ మార్కేట్‌ను పెంచుకునే దిశగా చెర్రిని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌ చేసుకోవాలని హాట్‌స్టార్‌ ప్లాన్‌ చేసింది. దీంతో రామ్‌ చరణ్‌ తమ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సంతకం చేయడంపై డిస్నీప్లజ్‌ హాట్‌స్టార్‌ ఆనందం వ్యకం చేస్తోందని తెలుస్తోంది. 

కాగా రామ్ చ‌ర‌ణ్ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన చెర్రి ఆ తర్వాత నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటనలో, డ్యాన్స్‌లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా మారిన రామ్ చ‌ర‌ణ్ నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నాడు. అటూ హీరోగా ఇటూ నిర్మాతగా దూసుకుపోతున్న రామ్‌ చరణ్‌ ఇప్పుడు సరికొత్తగా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌కి బ్రాండ్ అంబాసిడర్ గా సైతం కొనసాగుతుండడం విశేషం.

స్పిరిట్ మూవీకి భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్న ప్రభాస్

స్పిరిట్ మూవీకి భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్న ప్రభాస్

   28 minutes ago


‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. ఓటమి బాధతో హాజరుకాని మెగా ఫ్యామిలీ

‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. ఓటమి బాధతో హాజరుకాని మెగా ఫ్యామిలీ

   19 hours ago


బాయ్‌ఫ్రెండ్ విక్కీ కౌశల్ సినిమా బెనిఫిట్ షో కి కత్రినా కైఫ్

బాయ్‌ఫ్రెండ్ విక్కీ కౌశల్ సినిమా బెనిఫిట్ షో కి కత్రినా కైఫ్

   16-10-2021


రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఆ దుర్గమ్మకే తెలియాలి.

రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఆ దుర్గమ్మకే తెలియాలి.

   14-10-2021


ఆర్యన్ ఖాన్ కామన్ సెల్‌కు మార్చారు: జైలు సూపరింటెండెంట్

ఆర్యన్ ఖాన్ కామన్ సెల్‌కు మార్చారు: జైలు సూపరింటెండెంట్

   14-10-2021


మా ఎన్నికల ఎఫెక్ట్.. శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు.. ఎవరిని ఉద్ద్యేశించో..?

మా ఎన్నికల ఎఫెక్ట్.. శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు.. ఎవరిని ఉద్ద్యేశించో..?

   14-10-2021


తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబించే వెబ్ సిరీస్ లు రావాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబించే వెబ్ సిరీస్ లు రావాల్సిన అవసరం ఉంది.

   13-10-2021


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా..

   13-10-2021


పాన్ మసాలా బ్రాండ్‌ కి షాక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్

పాన్ మసాలా బ్రాండ్‌ కి షాక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్

   12-10-2021


ప్రకాష్ రాజ్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.. ఖండించిన బండ్ల గణేష్

ప్రకాష్ రాజ్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.. ఖండించిన బండ్ల గణేష్

   12-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle