రకుల్ సినిమా షూటింగ్ మీద రాళ్ల దాడి
23-02-202123-02-2021 13:27:47 IST
Updated On 23-02-2021 15:23:12 ISTUpdated On 23-02-20212021-02-23T07:57:47.271Z23-02-2021 2021-02-23T07:57:38.678Z - 2021-02-23T09:53:12.337Z - 23-02-2021

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీ సినిమాలలో నటిస్తోంది. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కలిసి ఎటాక్ అనే మూవీ చేస్తుండగా, ఈ మూవీ షూటింగ్ ఉత్తర ప్రదేశ్ లోని ధనిపూర్లో జరుగుతుంది. షూటింగ్ గురించి తెలుసుకున్న స్థానికులు చిత్రీకరణ చూసేందుకు భారీగా తరలివచ్చారు. వారిని సెక్యూరిటీ అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షూటింగ్ చూసేందుకు సెక్యూరిటీ అనుమతి ఇవ్వకపోవడంతో స్థానికులు గొడవపడ్డారు. కొందరు రాళ్ళతో దాడి కూడా చేశారు. రాళ్ల దాడిలో సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. హీరో జాన్ అబ్రహం హీరోయిన్ రకుల్ కు ఎటువంటి గాయాలు కాలేదు. పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం షూటింగ్ నిర్వహించారు.
లక్ష్యరాజ్ దర్శకత్వంలో 'ఎటాక్' చిత్రం రూపొందుతుండగా, ఈ సినిమాని ఆగస్టు 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. ఇందులో భాగంగా ధనీపూర్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. యాక్షన్ సీన్లలో భాగంగా బాంబు బ్లాస్టులు షూట్ చేస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. షూటింగ్ చేస్తున్నారనే విషయం తెలిసి అక్కడికి పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు. షూటింగ్ స్పాట్ వద్ద గేటు మూసేయడంతో సెట్ గోడ ఎక్కి షూటింగు చూడటానికి జనం ఎగబడ్డారు.

దీంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుంది. దీంతో స్థానికులకు కోపం పెద్ద ఎత్తున వచ్చేసింది. సెక్యూరిటీ మీద.. షూటింగ్ స్పాట్ మీద రాళ్లదాడికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు వచ్చి స్థానికులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది గాయపడగా.. హీరో జాన్ అబ్రహం, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీ సినిమాలతో టాలీవుడ్ లో కూడా నటిస్తూ ఉంది. ఉప్పెన ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ తో కూడా రకుల్ ఓ సినిమాలో నటిస్తోంది. చెక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ తమిళ్ సినిమాలకు కూడా సైన్ చేసింది.
