newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

'రాజశేఖర్' దంపతులకు కరోనా..త్వరలో ఇంటికి తిరిగి వస్తామని ట్వీట్

17-10-202017-10-2020 17:31:34 IST
2020-10-17T12:01:34.282Z17-10-2020 2020-10-17T12:01:30.930Z - - 29-10-2020

'రాజశేఖర్' దంపతులకు కరోనా..త్వరలో ఇంటికి తిరిగి వస్తామని ట్వీట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా ఈ పదం వింటేనే గుండె ఝళుమంటోంది. ఈ ఏడాదిలో అతి పెద్ద విపత్తు ఏంటంటే ఈ కరోనా మహమ్మారే. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు వదిలారు. వారిలో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ మహమ్మారి నుండి మహా మహులు కూడా తప్పించుకోలేకపోతున్నారు. రీసెంట్ గా ఈ కరోనా బారిన హీరో రాజశేఖర్ ఫ్యామిలీ పడిందట. ఆ విషయాన్ని రాజశేఖరే స్వయంగా ట్వీట్ చేశారు.

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు చాలామంది దీని బారిన పడ్డారు. టాలీవుడ్ లో కూడా అనేకమంది ప్రముఖులకు కరోనా సోకగా.. చికిత్స తీసుకొని బయటపడ్డారు. రాజమౌళి - కీరవాణి ల కుటుంబం - బండ్ల గణేష్ - నాగబాబు - తమన్నా వంటి వారు కోవిడ్-19 బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ జంట రాజశేఖర్ - జీవిత లకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. రాజశేఖర్ - జీవిత దంపతులకు వారం రోజుల క్రితమే కరోనా సోకగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రీసెంట్ గా రాజశేఖర్ తన ఫ్యామిలీకి కరోనా సోకిందని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ''నాకు జీవిత మరియు పిల్లలకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించబడిందని.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని వస్తున్న వార్తలు నిజమే. పిల్లలు ఇద్దరూ దాని నుండి పూర్తిగా బయటపడ్డారు. జీవిత మరియు నేను చాలా బాగున్నాము. త్వరలో ఇంటికి తిరిగి వస్తాము! ధన్యవాదాలు!'' అని రాజశేఖర్ ట్వీట్ చేశాడు. కాగా గతేడాది 'కల్కి' సినిమాతో వచ్చిన రాజశేఖర్.. ప్రముఖ దర్శకుడు నీలకంఠతో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు రాజశేఖర్ కుమార్తె శివానీ.. తేజా సజ్జా హీరోగా పరిచయం అవుతున్న సినిమాతో హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతోంది. ఇప్పటికే చిన్నమ్మాయి శివాత్మిక రాజశేఖర్ 'దొరసాని' సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రశంసలు దక్కించుకుంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle