newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

రాజ్ తరుణ్ - హేబ్బా పటేల్ లవ్ లో ఉన్నారా..?

30-09-202030-09-2020 22:02:31 IST
2020-09-30T16:32:31.743Z30-09-2020 2020-09-30T16:32:28.418Z - - 20-10-2020

రాజ్ తరుణ్ - హేబ్బా పటేల్ లవ్ లో ఉన్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా పరిచయమై... తొలి సినిమాతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యువ హీరో రాజ్ తరుణ్. ఆతర్వాత కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్త మావ చిత్రాలతో వరుస విజయాలు సాధించి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆతర్వాత కెరీర్ లో కాస్త వెనకబడ్డాడు. రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం ఓరేయ్ బుజ్జిగా. ఈ చిత్రానికి ఒక లైలా కోసం, గుండెజారీ గల్లంతయ్యిందే చిత్రాల దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అక్టోబర్ 2న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే... ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా హేబ్బా పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. అది ఏంటంటే... ఈ సినిమా తనకి, రాజ్ తరుణ్ కి మంచి విజయాన్ని అందిస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు అని చెప్పి సినిమా విజయం పై ఉన్న నమ్మకాన్ని తెలియచేసింది. ఇక అసలు విషయానికి వస్తే... రాజ్ తరుణ్, హేబ్బాపటేల్ ఇద్దరూ లవ్ లో ఉన్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు హేబ్బే మాటలు చూస్తుంటే.. ఇది అక్షరాల నిజం అనిపిస్తుంది.

ఇంతకీ.. హేబ్బా ఏం చెప్పిందంటే.. తన కెరీర్లో 90 శాతం రాజ్ తరుణ్ తో కలిసే నటించానని చెప్పింది. ఇప్పుడు ఇద్దరం కలిసే ఉంటున్నామని తెలిపింది. హేబ్బా ఇలా.. రాజ్ తరుణ్ తో కలిసే ఉంటున్నాను అని చెప్పడం విశేషం. అయితే.. కలిసు ఉంటున్నాం అని చెప్పింది కానీ.. ప్రేమ పెళ్లి గురించి మాత్రం చెప్పలేదు. రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle