newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

సహజత్వం ఉట్టి పడేలా.. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం

17-10-202017-10-2020 15:51:38 IST
2020-10-17T10:21:38.385Z17-10-2020 2020-10-17T10:21:27.927Z - - 26-10-2020

సహజత్వం ఉట్టి పడేలా.. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లెజెండరీ సింగర్.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు దివి నుండి భువికి దిగివచ్చినట్టుగా అనిపిస్తోంది ఆయన విగ్రహం చూస్తే. బాలసుబ్రమణ్యం గారు బతికి ఉన్నప్పుడే ఆయన విగ్రహాన్ని తయారు చేయాల్సిందిగా కోరడం విశేషం. ఆ విగ్రహం తయారైంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మృతి చెంది వారాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి ఆయన అభిమానులు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. ఎక్కడ ఆయన పాట విన్నా కూడా ఇంకా ఆయన బతికే ఉన్నారా అన్నట్లుగా అనిపిస్తుంది అంటూ అభిమానులు ఆయన్ను ఊహించుకుంటున్నారు.

కరోనా కారణంగా బాలు ఆరోగ్యం క్షీణించింది. దాంతో ఆయన ఆరోగ్యం మళ్లీ బాగుపడలేదు. ఆయన కరోనాను జయించినా ఆ తర్వాత కొన్ని రోజులకు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన బతికి ఉంటే మరెన్ని గానామృతాలను జనాలకు అందించేవారో. ఆయన లేని లోటు ఎప్పటికి తీర్చలేనిది. ఆయన జ్ఞాపకాలను ప్రజలకు ఇచ్చేందుకు గాను ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ బాలు గారి విగ్రహంను తయారు చేశారు.

ఈస్ట్ గోదావరికి చెందిన శిల్పి రాజ్ కుమార్ గారి వద్ద బాలు గారు గతంలో తన తల్లిదండ్రుల విగ్రహాలను తయారు చేయించారు. బతికి ఉండగానే తన విగ్రహంను తయారు చేయాల్సిందిగా బాలు గారు రాజ్ కుమార్ కు చెప్పారు. ఆ విగ్రహం తయారు చేస్తున్న సమయంలోనే అలా జరిగి పోయింది. బాలు గారు మృతి చెంది నెల రోజులు కాబోతున్న నేపథ్యంలో ఆయన విగ్రహంను రాజ్ కుమార్ పూర్తి చేశారు.

సహజత్వం ఉట్టి పడేలా విగ్రహాలను తీర్చి దిద్దడం రాజ్ కుమార్ ప్రత్యేకత. బాలు గారి విగ్రహంలోనూ పూర్తి డీటైల్స్ ను తీసుకు వచ్చి నిజంగా బాలు గారు కళ్ల ముందు ఉన్నారా అన్నట్లుగా విగ్రహాన్ని మల్చారు. బాలు గారి జ్ఞాపకార్థం ఆయన అభిమానులు చాలా చోట్ల విగ్రహాలను ప్రతిష్టించేందుకు సిద్దం అవుతున్నారు. తెలుగు ప్రభుత్వాలు కూడా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విగ్రహాన్ని చూస్తే బాలు గారు సజీవంగా ఉన్నారా అన్నంతగా కళ ఉట్టిపడుతోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle