newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

లారెన్స్ కి లక్ష్మీ బాంబ్ బాలీవుడ్ లో సక్సస్ సాధించేనా..?

10-10-202010-10-2020 07:29:57 IST
2020-10-10T01:59:57.068Z09-10-2020 2020-10-09T16:04:12.484Z - - 21-10-2020

లారెన్స్ కి లక్ష్మీ బాంబ్ బాలీవుడ్ లో సక్సస్ సాధించేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ్రూపు డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా.. ఇలా తను ప్రవేశించిన ప్రతిశాఖలో సక్సస్ సాధించి మల్టీటాలెంటె పర్సన్.. అంతకు మించి గొప్పమానవతావాది రాఘవ లారెన్స్. ఇప్పటి వరకు తెలుగు, తమిళ్ లో సినిమాలు తెరకెక్కించిన లారెన్స్  ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్షయ్ కుమార్ తో లక్ష్మీ బాంబ్ అనే సినిమా తెరకెక్కించారు. ఇది లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమాకి రీమేక్. ఇందులో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా.. నవంబరు 9న రిలీజ్ చేయనున్నారు.

ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. దెయ్యాలు, భూతాలనేవి లేవు అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభమైంది. అక్షయ్ కుమార్‌ కోపంతో.. నిజంగా దెయ్యాన్ని చూసిన రోజు.. నా చేతికి గాజులు వేసుకుంటా అని అంటాడు. షాపింగ్‌ మాల్‌లో ఎర్ర రంగు చీర కట్టుకుని అక్షయ్‌ కుమార్ మాట్లాడే తీరు అద్భుతమనే చెప్పవచ్చు. ఈ చిత్రంలో అక్షయ్‌కు, కియారాకు పెళ్లి జరుగుతుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే.... కాంచన కథలో స్వల్ప మార్పులు చేసినట్లు అనిపిస్తుంది. మొత్తానికి ట్రైలర్ తో బాగా ఆకట్టుకున్నారు.

కాంచన సినిమా చూసిన వాళ్లు కూడా ఏఏ మార్పులు చేసారో తెలుసుకునేందుకు ఒక్కసారైనా చూడాలి అనేలా లక్ష్మీ బాంబ్ ట్రైలర్ ఉంది. మరి.. తెలుగు, తమిళ్ లో సక్సస్ సాధించిన లారెన్స్ బాలీవుడ్ మూవీతో సక్సస్ సాధిస్తాడో లేదో చూడాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle