newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాయ్ లక్ష్మి.. పెళ్లి ఫిక్స్ అయ్యింది

07-04-202107-04-2021 19:24:40 IST
Updated On 07-04-2021 11:38:23 ISTUpdated On 07-04-20212021-04-07T13:54:40.361Z07-04-2021 2021-04-07T05:19:29.096Z - 2021-04-07T06:08:23.346Z - 07-04-2021

రాయ్ లక్ష్మి.. పెళ్లి ఫిక్స్ అయ్యింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాయ్ లక్ష్మి.. లక్ష్మీ రాయ్.. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆమె వివాహం నిశ్చయమైంది. ఈ నెల 27న ఆమె ఎంగేజ్ మెంట్ జరగబోతోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. చాలా కాలంగా పెళ్లి ఎప్పుడన్న విషయమై తనను ఎందరో ప్రశ్నిస్తున్నారని తెలిపింది. తానేమీ దాచుకోవాలని భావించడం లేదని, తాను ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నానని, 27న నిశ్చితార్థం జరుగనుందని తెలిపింది.

‘‘కొంత కాలంగా చాలామంది నన్ను పదే పదే మీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అడుగుతున్నారు.. నేను నా రిలేషన్‌షిప్‌ని దాచాలనుకోవడం లేదు. అయితే ఆ మాటకొస్తే నా రిలేషన్‌షిప్‌ గురించి వేరేవాళ్లకు అనవసరం. ఈ విషయంలో నాకంటూ కొంత స్వేచ్ఛ కావాలి. అంతేకాదు నాకు కాబోయే వాడి గురించిన విషయాలను బయటపెట్టాలనుకోవడం లేదు.. మా ఎంగేజ్‌మెంట్‌ తేదీ కూడా ఫిక్సయింది. ఈ నెల 27న జరగనున్న మా నిశ్చితార్థానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను గత వారమే మా సన్నిహితులకు, ఫ్రెండ్స్‌కు పంపాము. అయితే ఇది ఎప్పుడో ప్లాన్‌ చేసుకున్నది మాత్రం కాదు. అనుకోకుండా అలా జరిగింది" అని ఆమె తెలిపింది.