newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

08-04-202108-04-2021 07:29:41 IST
2021-04-08T01:59:41.565Z08-04-2021 2021-04-08T01:59:34.298Z - - 11-04-2021

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అల్లు అర్జున్ పుట్టినరోజు పుష్ప సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. బుధవారం నాడు ఊరిస్తూ.. ఊరిస్తూ.. సినిమా టీజర్ ను 8.19 గంటలకు రిలీజ్ చేశారు. ఇప్పుడు భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. అన్ని భాషలకు కలిపి ఒకే టీజర్ ను విడుదల చేశారు. సినిమా మొత్తం ఎర్ర చందనం దుంగల చుట్టూ తిరుగుతుందని.. ఆ స్మగ్లింగ్ వ్యవహారంలో చిక్కుకున్న హీరో కథే ఈ సినిమా అని టీజర్ ద్వారా తెలిసిపోయింది. ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. "తగ్గేదే.. లే" అంటూ అంటూ చిత్తూరు యాసలో అల్లు అర్జున్ చెప్పడం ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ ను తెప్పిస్తుంది. 

హైదరాబాదులో జరిగిన 'పుష్ప ఫస్ట్ మీట్' కార్యక్రమంలో ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ లో దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందనే చెప్పుకోవచ్చు. 

పుష్ప ఫస్ట్ మీట్ కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్ పుష్ప మాట్లాడుతూ 'నా పుట్టినరోజుకు అభిమానులు చూపుతున్న ప్రేమ కంటే ఇంకేం ఎక్కువ అవసరంలేదు. సుకుమార్ నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి. స్టయిలిష్ స్టార్ నుంచి ఐకానిక్ స్టార్ గా మార్చేశాడు. ప్రతిదీ గుర్తుండిపోయేలా విజయాలు అందించాడు. నేనేం చేసినా అభిమానుల కోసమే. నా జీవితం వారికి అంకితం' అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు.  పుష్ప చిత్రంలోని తగ్గేదే.. లే డైలాగు సినిమాలోనే కాదు.. నా జీవితంతోనూ సంబంధం ఉన్న డైలాగు.. అనేక కష్టనష్టాల్లో ఉన్నప్పుడు నన్ను నేను ఉత్సాహపరచుకునేటప్పుడు తగ్గేదే.. లే అని అనుకుంటానని తెలిపాడు బన్నీ.  పుష్ప కూడా పాన్ ఇండియా ఫిలిం అని.. అనేక పాన్ ఇండియా చిత్రాల నడుమ పుష్ప కూడా వస్తోందని.. చించేయాల్సిన బాధ్యత అభిమానులదేనని అన్నాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పాలంటే తను కూడా మైండ్ లో తగ్గేదే.. లే అని ఫిక్సయినట్టున్నాడు. అదిరిపోయే సంగీతం అందించాడు. మీకు కూడా నచ్చుతుందని నమ్ముతున్నానన్నాడు. చాలాకాలంగా నేను, సుకుమార్, దేవి కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఈ సినిమాలోనూ మేం అభిమానులను మెప్పిస్తామని సినిమా గురించి ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. 

 

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

   18 hours ago


శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

   15 hours ago


ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

   20 hours ago


వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

   09-04-2021


మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

   09-04-2021


మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

   09-04-2021


మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

   08-04-2021


సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

   08-04-2021


రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

   08-04-2021


ఐకాన్ స్టార్ కి అంత సీన్ లేదంట

ఐకాన్ స్టార్ కి అంత సీన్ లేదంట

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle