newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

వైరల్ గా 'పూరి మ్యూజింగ్స్'.. 65దేశాల్లో..152ఎపిసోడ్స్!

04-12-202004-12-2020 22:27:52 IST
Updated On 05-12-2020 09:43:19 ISTUpdated On 05-12-20202020-12-04T16:57:52.717Z04-12-2020 2020-12-04T16:57:41.874Z - 2020-12-05T04:13:19.202Z - 05-12-2020

వైరల్ గా 'పూరి మ్యూజింగ్స్'.. 65దేశాల్లో..152ఎపిసోడ్స్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆయనేదో చెపుతున్నాడు..మనమేదో వింటున్నాం అనుకున్నాం ఇన్నాళ్లు..ఆయన మాటలకి ఇంతటి క్రేజ్ ఏర్పడుతుందనుకోలేదు ఎవ్వరూ కూడా. ప్రతి విషయాన్ని తనదైనశైలిలో బోల్డ్ గా చెప్పే సత్తా కలిగిన వ్యక్తి ఆయన. ఇంతకీ ఆయనెవరు అనుకుంటున్నారా..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీజగన్నాథ్. ఆయన ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. వెండితెరపై ఆయన పంచ్ లకు ఉండే క్రేజు అంతా ఇంతా కాదు. హైఎనర్జీతో పంచ్ డైలాగ్ రైటర్ గా ఆయన ది బెస్ట్ యూత్ ఫుల్ రైటర్ అని ప్రూవ్ చేశారు కూడా. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈయన పంచ్ లకి పడిపోతుంటారు.

ఇటీవల `పూరి మ్యూజింగ్స్` పేరుతో ఎన్నో హిడెన్ సంగతుల్ని `మాటల రూపకంగా`నే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు చెబుతున్నారు పూరీ జగన్నాథ్. ఆయన మాట తీరు .. సూటిగా ఉండే వచనం అందరి బుర్రలకు జోరుగా ఎక్కేస్తుండడంతో పూరి మ్యూజింగ్స్ ఎపిసోడ్స్ సంచలనంగా నిలుస్తున్నాయి. టాప్ 2020 పాడ్ కాస్టర్ గా క్రెడిట్ పూరీకే దక్కుతుంది. ప్రఖ్యాత స్పోటిఫై ఇండియాలో పూరి మ్యూజింగ్స్ టెలీ కాస్ట్ అయ్యాయి ఈ ఎపిసోడ్స్ అన్నీ . పూరి మ్యూజింగ్స్ 65 దేశాల్లో 540 నిమిషాలతో 152 ఎపిసోడ్స్ వైరల్ అయ్యాయంటే మామూలు విషయం కాదుగా.

మూడు దేశాల్లో 104రోజుల పాటు చార్ట్స్ లో టాప్ పొజిషన్ లో నిలిచాయి పూరీ మ్యూజింగ్స్ ఎపిసోడ్స్. అలాగే 68193 మంది ప్రజలు వీటిని విన్నారు. ఏ ఇతర పాడ్ కాస్ట్ తో పోల్చినా ఇదే ది బెస్ట్. ఆ మేరకు పూరి కనెక్ట్స్ తరపున వివరాలందించారు. కాగా మరోవైపు పూరి ఫైటర్ మూవీ చిత్రీకరణకోసం వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ పీరియడ్ లో స్క్రిప్ట్ బెటర్ మెంట్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్యాపాండే జంటగా నటిస్తున్నారు. అలాగే తన శిష్యులకు వెబ్ సిరీస్ స్క్రిప్టుల్ని అందించి వాటిని పూరీ జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తున్నారన్న సమాచారం ఉంది. టాలెంట్ ఉన్నాడో ఏదైనా చేయగలడు..సృష్టించగలడు అని నిరూపించాడీ డైరెక్టర్.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle