newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్ కి గట్టిగా సమాధానం చెప్పిన పునర్నవి..

30-09-202030-09-2020 18:24:32 IST
Updated On 30-09-2020 18:34:08 ISTUpdated On 30-09-20202020-09-30T12:54:32.453Z30-09-2020 2020-09-30T12:54:29.810Z - 2020-09-30T13:04:08.608Z - 30-09-2020

ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్ కి గట్టిగా సమాధానం చెప్పిన పునర్నవి..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బిగ్ బాస్ సీజన్ 3లో ఒక మామూలు కంటెస్టంట్ గా వచ్చి ఆ షోతో బాగా పాపులర్ అయ్యింది పునర్నవి. ఆ షోలో రాహుల్ తో కలిసి బాగా ఎంటర్టైన్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య చాలానే రొమాంటిక్ సన్నివేశాలు జరిగాయి. గత సీజన్లో రాహుల్ విన్నర్ అవడానికి పునర్నవి కూడా సాయం చేసిందనే చెప్పొచ్చు. పునర్నవి కూడా గత సీజన్ చివరి వరకు ఉండి చివరి వారాల్లోనే హౌజ్ నుండి బయటకు వచ్చింది. అంతకుముందు సినిమాల్లో సైడ్ రోల్స్ వేసిన పునర్నవి హీరోయిన్ గా కూడా రెండు సినిమాల్లో చేసింది. వాటితో రాని క్రేజ్ బిగ్ బాస్ షోతో వచ్చింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఆమెకు అభిమానులు కూడా బాగానే పెరిగారు. 

సెలెబ్రిటీలు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటున్నారు. అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటున్నారు. అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం సెలెబ్రిటీలతో మిస్ బిహేవ్ చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో. పునర్నవి కూడా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన హాట్ పిక్స్ కూడా పెడుతూ అభిమానులని అలరిస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లైవ్ కి కూడా వస్తుంది. ఇటీవల అలా లైవ్ కి వచ్చినప్పుడు తనకు ఎదురైనా సంఘటనని కూడా షేర్ చేసుకుంది.

ఇటీవల సోషల్ మీడియాలో లైవ్ కి వచ్చిన పునర్నవికి ఓ నెటిజెన్ ఆమె వాట్స్ అప్ నంబర్ అడిగాడు. దానికి ఆమె ఇచ్చిన ఆన్సర్ అతనిని దిమ్మతిరిగేలా చేసింది. తన నంబర్ అడిగిన నెటిజెన్ కు పునర్నవి శివమణి లో నాగార్జున నంబర్ ఇచ్చే వీడియోని షేర్ చేసింది. అంతే కాకుండా సెలబ్రిటీస్ ను నంబర్ తీసుకుని ట్రోల్ చేయడం కామన్ అయ్యింది. వారి సోషల్ మీడియా ఖాతల్లో కూడా అసభ్యకరమైన కామెంట్స్ తో ఇబ్బంది పెట్టడం బాగా అలవాటైంది అని గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఇది చూసి మిగతా నెటిజన్స్ కూడా షాక్ అయ్యారు.   


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle