ప్రదీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత క్యూ
04-03-202104-03-2021 15:41:34 IST
2021-03-04T10:11:34.497Z04-03-2021 2021-03-04T05:34:52.793Z - - 11-04-2021

30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ పేరు చూస్తే అర్దం అవుతుంది కదా. ఇదేదో యూట్యూబ్ రేంజ్ సినిమా అని. అదీ కాక.. యాంకర్ కావడంతో.. అంతా సింపుల్ గా తీసుకున్నారు. ఏమోలే.. తెలుగు యాంకర్ గా ఇంత పేరుంది. ఇంత మంది హీరోగా చేస్తున్నారు. ప్రదీప్ కి మాత్రం ఏం తక్కువ. తను కూడా ఓ సినిమా చేశా అనుకుంటాడు. అందులో తప్పేముంది. తనకీ కోరిక ఉంటుంది కదా. హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి అనుకున్నారు. ఓ కోటి రూపాయలో రెండు కోట్లో పెట్టి సినిమా తీస్తారు. అందులో సగం బడ్జెట్ హీరోనే పెడతాడు.. సో.. తాను హీరో అయ్యా అనిపించుకుంటాడు.. అంతేలే అనుకున్నారు.
కానీ.. లెక్కలు మారిపోయాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అద్దిరిపోయింది. ప్రదీప్ మాచిరాజు అంటే.. అనూప్ కి ఇష్టమే ఉంటుంది కదా. ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది కదా. ఆ లెక్కన ఓ సాంగ్ కి అద్దిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. సిద్ శ్రీరామ్ పాడిన పాటకావడం.. సిద్ కి క్రేజ్ ఉన్న టైంలో వచ్చిన సాంగ్ కావడంతో.. దుమ్ములేచి పోయింది. నీలీ నీలీ ఆకాశం అంటూ.. బంపర్ హిట్ అయింది సాంగ్. ఆ తర్వాత అంతా మారిపోయింది. సినిమాపై హోప్స్ పెరిగాయి. ప్రదీప్ లుక్ డిఫరెంట్ గా ఉంది అంటూ.. ఇంట్రస్ట్ చూపించారు. కానీ.. సడన్ గా లాక్ డౌన్ వచ్చింది. సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయినా కాంప్రమైజ్ కాకుండా.. లాక్ డౌన్ అయిపోయేంత వరకూ ఆగింది మూవీ టీమ్. సడన్ గా ఓ ట్రైలర్ వచ్చింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీ ట్రైలర్ చూసి.. మళ్లీ ఎక్స్ పెక్టేషన్స్ తగ్గిపోయాయి. ఇదేదో సాదా సీదా సినిమాలే అనుకున్నారు.
కానీ.. ప్రదీప్ మాచిరాజు ఫాలోయింగ్ మామూలుగా లేదు. లాస్ట్ లో ట్రైలర్లు గట్రా చూశాక.. రెగ్యులర్ ప్రోగ్రామ్స్ లో ఉండే టైప్ కామెడీ మూవీలో అనుకున్న వాళ్ల సంఖ్య తక్కువే అని తేలిపోయింది. సాంగ్ హిట్ కావడం.. ప్రదీప్ కి మంచి ఫాలోయింగ్ ఉండడంతో.. సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. కరోనా టైంలో కూడా 8 కోట్ల షేర్ వచ్చిందంటే ఆలోచించండి. ఇక గ్రాస్ లెక్కేస్తే 15 కోట్ల దాకా వసూళ్లు వచ్చి ఉంటాయి కదా. ఇక ప్రదీప్ సినిమా ఫ్లాప్ అయింది అని ఎలా అనగలం చెప్పండి. అందుకే.. చిన్న చిన్న నిర్మాతలు అంతా.. ప్రదీప్ పై ఫోకస్ చేశారట. కొత్త కొత్త డైరెక్టర్లు కూడా ప్రదీప్ కోసం వెంట పడుతున్నారట. అయితే.. ఈ సినిమాలు ఎలా ఉన్నా.. నెట్ ఫ్లిక్స్ తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు మాత్రం టాక్ వస్తోంది. మిగతావి క్యూలో ఉంచి.. నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ని ఓకే చేయాలి అనుకుంటున్నాడట. చూస్తుంటే.. చాలా చూజింగ్ గా వెళ్తున్నట్లు కనిపిస్తున్నాడు ప్రదీప్.

అపరిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా
17 hours ago

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది
14 hours ago

ఇప్పటికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు
19 hours ago

వకీల్ సాబ్ మూవీలో.. బద్రి మూవీ
09-04-2021

మాల్దీవుల్లో స్విమ్ సూట్లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..
09-04-2021

మూడేళ్ల మూడు నెలల గ్యాప్ తర్వాత బొమ్మ పడింది
09-04-2021

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా
08-04-2021

సిసింద్రీ ట్రయల్ వర్కవుట్ అవుతుందా
08-04-2021

రామ్ చరణ్ నే లైట్ తీసుకుంది.. అనుపమ మొండి మనిషే
08-04-2021

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే
08-04-2021
ఇంకా