మరో పాన్ ఇండియా సినిమాకు ప్రభాస్ సై..
01-12-202001-12-2020 10:34:48 IST
2020-12-01T05:04:48.259Z01-12-2020 2020-12-01T05:04:45.530Z - - 28-01-2021

బాహుబలి ప్రభాస్‌ను నిర్మాతలు, దర్శకులు నేలమీదికి దింపాలనుకోవడం లేదు. తనతో సినిమాలు ప్రకటిస్తున్న ప్రతి నిర్మాత, దర్శకుడు పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకునే సినిమా తీస్తున్నామని చెబుతున్నారు. ఈ కోవలోకి మరో సినిమా కూడా వచ్చి చేరింది.
ఇప్పటికే హీరో ప్రభాస్ చేస్తున్న ‘రాధే శ్యామ్’, చేయబోయే ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయేవి కూడా ప్యాన్ ఇండియా సినిమాలే. ఇప్పుడు మరో సినిమా ప్రకటించడానికి రెడీ అయ్యారని తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌ను డిసెంబర్ 2న ప్రకటించనున్నారని తెలిసింది.
‘కేజీయఫ్’ను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తున్నట్టు సోమవారం పేర్కొంది. ఇది ప్రభాస్ – ప్రశాంత్ నీల్ సినిమాయే అని టాక్. హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ దీనిపై మాట్లాడుతూ కేజీఎఫ్ 2 తర్వాత మరో ప్యాన్ ఇండియా సినిమా చేస్తామని చెప్పారు.
మేం ప్రస్తుతం చేస్తున్న ‘కేజీయఫ్ 2’ మీద చాలా అంచనాలు ఉన్నాయని తెలుసు. వాటన్నింటినీ మించేలా ఈ సినిమా ఉంటుంది. అలానే మా తదుపరి సినిమా కూడా ప్యాన్ ఇండియన్ సినిమాయే. డిసెంబర్ 2న 2 గంటల 9 నిమిషాలకు ఈ సినిమాని ప్రకటిస్తాం అన్నారు.
దీంతో ఇది ప్రభాస్–ప్రశాంత్ నీల్ సినిమా అనే చర్చలు మొదలయ్యాయి. మరి.. ఇది నిజమా కాదా అనేది ఒక్క రోజులో తెలిసిపోతుంది.
కేజీఎఫ్ దర్శకుడు ప్రభాస్‌కు ఇప్పటికే కథ వివరించారని ఆయన కథనంతో ఇంప్రెస్ అయిన ప్రభాస్ ఈ కొత్త సినిమాకు సైన్ చేయడానికి కూడా సిద్దమయ్యారని శాండల్ వుడ్ వర్గాల సమాచారం.
బాహుబలి’తో భారతీయ ప్రేక్షకులందరికీ ప్రభాస్ తెగ నచ్చేశాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమా చూడాలని ప్రతీ ప్రాంతానికి చెందిన ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దీంతో ప్రభాస్ ప్యాన్ ఇండియన్ కథల్నే ఎంచుకుంటున్నారు.

ధర్మస్థలి ఇలా ఉండబోతోంది.. ఆసక్తిని పెంచేస్తున్న 'ఆచార్య'
7 minutes ago

మిథాలీ రాజ్ బయోపిక్ కోసం తాప్సీ ట్రైనింగ్..కష్టే ఫలి
an hour ago

బికినీ వేసి బుట్ట చేత పట్టుకున్న విదేశీ బ్యూటీ..వైరల్ గా పిక్
2 hours ago

శృతిహాసన్ బర్త్ డే..సలార్ హీరోయిన్ గా ఫిక్స్
4 hours ago

గూస్ బంబ్స్ వచ్చేలా పుష్ప పోస్టర్..రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన బన్నీ
5 hours ago

ఎడారిలో పుషప్స్..దటీజ్ తాప్సీ
20 hours ago

మాస్టర్ టీం కి అమెజాన్ షాక్...ఏం జరిగింది..
20 hours ago

ఎద సంపదతో ఎదలను కోసేస్తుందే..
8 hours ago

జనవరి 29న సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లుక్..ఎలా ఉండనుందో
a day ago

పవన్ ఓ దొంగ
27-01-2021
ఇంకా