newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రభాస్ 'సలార్' రిలీజ్ డేట్ ఫిక్స్

28-02-202128-02-2021 18:56:20 IST
2021-02-28T13:26:20.679Z28-02-2021 2021-02-28T11:32:42.137Z - - 11-04-2021

ప్రభాస్ 'సలార్' రిలీజ్ డేట్ ఫిక్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా 'సలార్'. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ తాజాగా వచ్చింది. 2022 ఏప్రిల్ 14న సాలార్ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తోంది. క‌న్న‌డ యాక్ట‌ర్ మ‌ధు గురుస్వామి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల కొద్ది రోజుల పాటు తెలంగాణలోని రామ‌గుండం బొగ్గు గన‌ల్లో ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు.

'రాధే శ్యామ్' విడుదల తేదీని ప్రకటించిన ప్రభాస్.. తాజాగా ఆయన నటిస్తున్న 'సలార్' సినిమా థియేట్రికల్ రిలీజ్ తేదీని ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాలకు రివీల్ చేస్తున్నట్టుగా చిత్రబృందం తెలిపింది. అన్న‌ట్లుగానే చిత్ర బృందం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ( 14-04-2022) విడుద‌ల కానుంది.

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బొగ్గుగనుల్లో పనిచేసే యువకుడి పోరాటమే 'సలార్' చిత్ర కథాంశం అని ప్రచారం జరుగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆలిండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడం, కేజీఎఫ్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ భారీ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో... ఈ కాంబోలో వస్తున్న 'సలార్' పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కేజీఎఫ్-2 కూడా భారీ హిట్ అవ్వబోతోందనే కాన్ఫిడెన్స్ అందరిలోనూ ఉన్నాయి.. ఇక ఆ తర్వాత రాబోయే సినిమా సలార్ కావడంతో ఇక అంచనాలు ఆకాశాన్ని తాకబోతున్నాయి. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ కూడా ఈ ఏడాది విడుదల కాబోతోంది. ఈ సినిమా మీద కూడా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభాస్ సినిమాలు సినిమా ప్రియులకు ఫుల్ మీల్స్ అందించనున్నాయి. రాధే శ్యామ్ పీరియాడిక్ లవ్ స్టోరీ కాగా.. సలార్ పక్కా మాస్ కమర్షియల్ సినిమా..!  

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

   17 hours ago


శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

   14 hours ago


ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

   19 hours ago


వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

   09-04-2021


మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

   09-04-2021


మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

   09-04-2021


మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

   08-04-2021


సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

   08-04-2021


రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

   08-04-2021


పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle