newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మరో భారీ చిత్రం

12-06-202112-06-2021 08:41:39 IST
2021-06-12T03:11:39.738Z12-06-2021 2021-06-12T03:11:03.050Z - - 25-07-2021

ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మరో భారీ చిత్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

'కేజీఎఫ్' సినిమాతో కన్నడ సినిమారంగంలోనే బిగ్గెస్ట్ హిట్ అందించిన ఘనత ప్రశాంత్ నీల్ కి దక్కుతుంది. పాన్ ఇండియా మూవీ గా రూపొందిన ఈ చిత్రంలో హీరోగా నటించిన యష్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం ఇది. కేజిఎఫ్ పార్ట్ 2 విడుదలకి సిద్దంగా ఉంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. 

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు. రాదేశ్యాం చిత్రం షూటింగ్ పూర్తీ చేసుకుని విడుదలకి సిద్దంగా వుంది. అలాగే రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆదిపురుష్ లో రాముడిగా ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటిస్తుండగా రావణాసురుడిగా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. అలాగే హిందీ వార్ చిత్రానికి సీక్వెల్ లో కూడా ప్రభాస్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి స్టార్ నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా బాహుబలి సిరీస్ కంటే ఎక్కువ విజయం సాధిస్తుందని నిర్మాత నమ్మకంగా ఉన్నాడు. ఇండియాలోని బిగ్గెస్ట్ హిట్ సాధించి ఈ చిత్ర్తం చరిత్ర సృష్టిస్తుందని అంటున్నారు. అత్యంత హై క్వాలిటీ టెక్నాలజీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోయే ఈ చిత్రం అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

   10 hours ago


నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

   11 hours ago


హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

   a day ago


Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

   24-07-2021


ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

   24-07-2021


రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

   24-07-2021


ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

   24-07-2021


తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

   23-07-2021


బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

   23-07-2021


నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

   23-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle