ప్రభాస్ 25వ చిత్రం.. 5 వందల కోట్లు.. కొరటాలకి బంపర్ ఆఫర్
19-02-202119-02-2021 13:19:34 IST
Updated On 19-02-2021 14:36:24 ISTUpdated On 19-02-20212021-02-19T07:49:34.728Z19-02-2021 2021-02-19T06:36:43.899Z - 2021-02-19T09:06:24.815Z - 19-02-2021

ఏందిది.. ఏందయ్యా ఇది. ఇన్ని కోట్లా.. అవి వేసుకునే కోట్లా.. సూటుకేసుల్లో ఉండే కరెన్సీ నోట్లా. 5 వందల కోట్లంటే ఉత్తి మాటలా చెప్పండి. అయ్యే పనేనా అనుకోవద్దు. ఎందుకంటే.. బాహుబలి సినిమాతోనే వందల కోట్లు బడ్జెట్.. తర్వాత సాహో.. ఇప్పుడు సలార్.. మళ్లీ ఆదిపురుష్, తర్వాత నాగ్ అశ్విన్ సినిమా. ఇలా వందల కోట్లలోకి వెళ్లింది ప్రభాస్ బడ్జెట్. డార్లింగ్ రేంజ్ మారిపోయింది అనే విషయం తెలిసిందే కదా. అందుకే.. బాహుబలి 25వ సినిమాకి 5 వందల కోట్ల ప్లానింగ్ నడుస్తోందంట. ఎందుకంటే.. ఇప్పటికే నాగ్ అశ్విన్ మూవీతో.. అశ్వనీదత్ వాళ్లు 4 వందల కోట్లకి రెడీ అయ్యారు. ఆల్రెడీ ఆదిపురుష్ కూడా అలాంటి మూవీనే.. సో.. సలార్..ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీస్ తర్వాత.. ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే కదా. అందుకే.. ఏకంగా 5 వందల కోట్ల అవసరం తప్పని సరి కదా. ఇప్పటికే బాహుబలితో రిచ్ మేకింగ్ కి అలవాటైంది ప్రభాస్ మూవీ. సాహోతో.. హాలీవుడ్ రేంజ్ కి వెళ్లింది. సాహో మూవీ తెలుగు వారికి పెద్దగా నచ్చలేదు కానీ.. బాలీవుడ్ లో బంపర్ హిట్ అయింది. ఆ మూవీలో ప్రభాస్ లుక్ మనకి పెద్దగా అనిపించలేదు.. ఎందుకంటే.. మనం ప్రభాస్ ని ఇంకాస్త అందంగా చూశాం. సాహోలో కొన్ని చోట్ల ప్రభాస్ లుక్ దెబ్బై పోయింది. కానీ.. ఓవరాల్ గా మూవీలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు.. సాహో మేకింగ్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ని మరిపించేలా ఉంది. మరిపించేలా కాదు.. హాలీవుడ్ స్టార్ హీరోల్ని మరిపించింది కూడా. అందుకే.. బాలీవుడ్ లో అంత హిట్ అయింది సాహో. సుకుమార్, విజయ్ దేవరకొండని.. బన్నీ లాక్కెళ్తాడా మరి నెక్స్ట్ మూవీ.. మైత్రీ మూవీ మేకర్స్. మరి మైత్రీ మూవీ మేకర్స్ అంటే మూమూలుగా ఉంటుందా చెప్పండి. వీటన్నీటినీ లెక్కలేసుకుని.. భారీ మూవీకి ప్రిపేర్ అవుతోందంట. అయితే.. ఆ రేంజ్ కి తగ్గ మూవీ కోసం.. కొరటాల శివని ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ ఎంట్రీనే ప్రభాస్ తో కదా. మిర్చి ఓ రేంజ్ హిట్ అయింది. ఇప్పుడు మెగాస్టార్ దాకా వెళ్లాడు. ఇక మిగిలిన బడా స్టార్ లు ఉన్నా.. ప్రభాస్ తో ఛాన్స్ వస్తే ఆగుతాడా చెప్పండి. అందుకే.. ఈ ఛాన్స్ కొరటాలకి దక్కినట్లు తెలుస్తోంది. మరి కొరటాల అంటే.. లోకల్ నేటివిటీతో తీసే డైరెక్టర్ కదా.. యూనిక్ గా ప్రభాస్ రేంజ్ కి.. పాన్ ఇండియా మూవీ తీస్తాడా.. లేదంటే సైడై పోతాడా అనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే.. ప్రభాస్ 25 మూవీ అంటే.. ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటయ్. అయినా కొరటాల శివ వరకు ఎందుకు తగ్గుతాడు చెప్పండి. అసలు తగ్గే టైపేనా తను.. హీరోయిజం ఎలివేట్ చేయడంలో కొరటాల స్టైలే డిఫరెంట్ కదా.

ప్రదీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత క్యూ
5 hours ago

బాలయ్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి
03-03-2021

హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యారవ్యాన్ లో ఏం జరుగుతోంది
03-03-2021

పవన్ సినిమా అయితే.. అంత చిన్న పాత్ర చేయాలా..?
02-03-2021

సన్నీలియోన్ కి మళ్లీ పెళ్లి.. గుంటూరు కుర్రాడు
02-03-2021

కంగనాకు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ
02-03-2021

నెట్ ఫ్లిక్స్ కి నాగ్ షాక్..అంత నమ్మకం ఏంటి..డేర్ స్టెప్ ఏంటి
01-03-2021

అన్నకి వ్యతిరేకంగా తమ్ముడు
01-03-2021

ప్రభాస్ 'సలార్' రిలీజ్ డేట్ ఫిక్స్
28-02-2021

ప్లే బ్యాక్ మూవీలో ఏదో ఉన్నట్లుందే
28-02-2021
ఇంకా