newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

పాలిటిక్స్ ప‌క్క‌కి.. కొత్త‌క‌థ‌లు తెర‌పైకి

21-02-202121-02-2021 17:39:46 IST
Updated On 22-02-2021 10:35:13 ISTUpdated On 22-02-20212021-02-21T12:09:46.314Z21-02-2021 2021-02-21T08:02:51.070Z - 2021-02-22T05:05:13.728Z - 22-02-2021

పాలిటిక్స్ ప‌క్క‌కి.. కొత్త‌క‌థ‌లు తెర‌పైకి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌ళ ఉంటే అంతే. ఇంట్ర‌స్ట్ ఉంటే అంతే. మేక‌ప్ లో ఉన్న మేజిక్కే వేరు. ఒక్క‌సారి మేక‌ప్ వేసుకుని తెర‌పైకి వ‌స్తే.. మ‌ళ్లీ వెన‌క్కి వెళ్లాలంటే క‌ష్ట‌మే. అందుకే.. ఎంతో మంది.. చిన్న చిన్న అవ‌కాశాలు వ‌చ్చినా.. అక్క‌డే ఉంటారు. సినీ ఇండస్ట్రీపై తెర‌పై ఉండే ఇంట్ర‌స్ట్ అలాంటిది ఆ  విష‌యంలో విజ‌య‌శాంతి కూడా మినహాయింపు ఏం కాదు. ఎందుకంటే.. ఆమె క‌ళామ్మ త‌ల్లి ముద్దు బిడ్డ క‌దా. తెలుగు హీరోయిన్ల‌లో ఎవ‌రికీ లేని క్రేజ్ ఆమెకుంది. ఒక‌ప్ప‌టి  హీరోయిన్లు  ఈ రోజుల్లో తెర‌పై ఉన్నా.. విజ‌య‌శాంతికి ఉన్న క్రేజ్ వారికి లేదు. గ‌ట్టిగా మాట్లాడితే.. హాట్ బేబీ ర‌ష్మిక కంటే.. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో విజ‌య‌శాంతికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. రిజ‌ల్ట్ కూడా ఆమెకే ఎక్కువ పేరు తెచ్చింది.

మ‌రి అలాంటి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత‌.. విజ‌య‌శాంతి మాత్రం ఎలా ఆగ‌గ‌ల‌రు చెప్పండి. క‌ళామ‌త‌ల్లిని వ‌దిలి దూరంగా వెళ్ల‌గ‌ల‌రా. ఆ టైంలో ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా సున్నితంగా తిర‌స్క‌రించారు. సినిమాలు చేయ‌రంట అనే టాక్ వ‌చ్చింది. ఎంతో మంది క్రియేట‌ర్లు, ప్రొడ్యూస‌ర్ల‌ని డిస‌ప్పాయింట్ చేశార‌ట కూడా. కానీ.. ఇప్పుడు మాత్రం ఓకే చేశార‌ట‌. ఇప్పుడెలాగూ పాలిటిక్స్ తెలంగాణ‌లో ర‌స‌వ‌త్త‌రంగా లేవు. బండి సంజ‌య్ ప‌రుగులు పెట్టిస్తున్నారు. దూకుడూ ఆయ‌న‌దే.. క్రెడిటూ ఆయ‌న‌దే. ఇంకో లీడ‌ర్ కి స్పేస్ లేకుండా స్పీడ్ పెంచారు. మ‌రి తాను మాత్రం.. ఎండ‌ల్లో తిరిగి.. ఎంత గ‌నం ఫైట్ చేయ‌గ‌ల‌రు చెప్పండి. ఇక ఎన్నిక‌ల టైం ఏళ్లు ఉంది క‌దా. అందుకే.. కాస్త సినిమా ఇండ‌స్ట్రీపై ఫోక‌స్ చేద్దాం లే అనుకుంటున్నార‌ట‌.

ఎలాగూ.. అప్పుడో కామెంట్.. ఇప్పుడో కామెంట్ చేస్తే.. ఎక్క‌డ‌లేని రెస్పాన్స్ వ‌స్తుంది. పొలిటిక‌ల్ గా కూడా ఆమె రేంజ్ వేరే క‌దా. మ‌రి మిగ‌తా టైంలో.. కాల్షీట్లు బిజీ చేసేస్తే.. రీ ఎంట్రీలో వ‌చ్చిన గ్రాండ్ రిజ‌ల్ట్ కి న్యాయం చేసిన‌ట్లు అవుతుంది క‌దా. అందుకే.. ఓ సినిమాకి ఓకే చెప్పార‌ట లేడీ అమితాబ్ గా పేరున్న విజ‌య‌శాంతి. అయితే.. మ‌రో హీరోతో కాకుండా.. మ‌రో హీరో క్రెడిట్ కొట్టేసే సినిమా కాకుండా.. తానే సినిమా హీరోగా మారాల‌ని చూస్తున్నార‌ట‌. విజ‌య‌శాంతి అంటే.. లేడీ హీరోగా పేరుంది క‌దా. ఇప్పుడు కూడా అలాంటి సినిమానే చేయ‌బోతున్నార‌ట‌. అప్ప‌ట్లో విజ‌య‌శాంతి లేడీ ఓరియంటెడ్ మూవీ భార‌త‌రత్న మూవీకి రెండు ద‌శాబ్ధాల కింద ఫుల్ నేమ్ వ‌చ్చింది. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ చేస్తున్నార‌ట‌. క్రియేట‌ర్లు.. ప్రొడ్యూస‌ర్లు అప్రోచ్ కావ‌డం.. అప్ప‌టి ప్రొడ్యూస‌ర్లే మ‌ళ్లీ సీక్వెల్ కూడా చేస్తుండ‌డం.. లేడీ ఓరియంటెడ్ మూవీ కావ‌డంతో.. ఓకే చెప్పేశార‌ని టాక్ వ‌స్తుంది. 

నిప్పులో ఉప్పేస్తున్న రాముల‌మ్మ


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle