newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

పవన్ కొత్త సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్

25-10-202025-10-2020 18:35:24 IST
Updated On 25-10-2020 18:37:05 ISTUpdated On 25-10-20202020-10-25T13:05:24.851Z25-10-2020 2020-10-25T13:04:43.234Z - 2020-10-25T13:07:05.186Z - 25-10-2020

పవన్ కొత్త సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో వకీల్ సాబ్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. సంక్రాంతికి కానుకగా ఈ క్రేజీ మూవీని భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో మూవీ చేస్తాడు. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ రెండు సినిమాలతో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో కూడా పవన్ కళ్యాణ్‌ సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే... దసరా సందర్భంగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాను ఎనౌన్స్ చేసారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది.

ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మలయాళంలో విజయం సాధించిన అయ్పప్పన్ కోషియమ్ చిత్రానికి రీమేక్ అని.. ఇందులో పవన్ తో కలిసి రానా నటించనున్నారని టాక్ వినిపించింది. ఈ రోజు దసరా సందర్భంగా ఈ మూవీని అఫిషియల్ గా ఎనౌన్స్ చేసారు. అయితే... ఇందులో రానా నటిస్తున్నాడా..? లేదా..? అనేది ప్రకటించలేదు కానీ.. సినిమాని మాత్రం ఎనౌన్స్ చేసారు. ఈ క్రేజీ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాకి పవన్ ముప్పై రోజులు డేట్స్ కేటాయించారని... చాలా స్పీడుగా ఈ సినిమాని కంప్లీట్ చేయనున్నారని సమాచారం. అయితే... వరుసగా సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో..? ఏ సినిమా తర్వాత చేస్తారో.. అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే పూర్తి వివరాలతో అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle