అక్కడ కూడా సీఎం.. సీఎం.. అంటూ అభిమానుల అరుపులు.. పవన్ ఏమన్నారంటే..!
05-04-202105-04-2021 10:50:53 IST
Updated On 05-04-2021 11:01:56 ISTUpdated On 05-04-20212021-04-05T05:20:53.500Z05-04-2021 2021-04-05T05:20:45.771Z - 2021-04-05T05:31:56.000Z - 05-04-2021

హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో పవన్ కళ్యాణ్ అభిమానుల నడుమ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానుల సందడి మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడొస్తారా అంటూ ఎదురు చూసిన అభిమానులు.. పవన్ కళ్యాణ్ రాగానే ఫుల్ జోష్ లోకి వెళ్లిపోయారు. ఇక బండ్ల గణేష్ స్పీచ్ ఈవెంట్ కే హైలైట్ అయ్యింది. ఇక ఆఖర్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగా.. అభిమానులు 'సీఎం.. సీఎం..' అంటూ అరవడం మొదలైంది. గతంలో ఇలాంటివన్నీ పట్టించుకోకుండా వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఈసారి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సీఎం అన్నది జరగాలబ్బా.. మనం కోరుకుంటే వచ్చేది కాదు' అని ఒక్క మాటలో తేల్చి పడేశారు పవన్ కళ్యాణ్. నువ్వు సినిమాలు ఎందుకు చేస్తున్నావు అని చాలామంది నన్ను అడుగుతున్నారు.. మీరు అయితే సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు.. పైరవీలు చేసుకోవచ్చు.. అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండొచ్చు.. నేను మాత్రం సినిమాలు చేయకూడదా అని వాళ్లకు సమాధానం చెప్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. తాను అవినీతి చేయకుండా ఉండటానికి సినిమాలు చేస్తున్నానని అన్నారు. కేవలం లక్షలోపు జీతం ఉండే ఎమ్మెల్యే పదవి కోసం ఎందుకు అంత ఆరాటపడుతున్నారు.. నాకు ఎప్పుడు పదవి మీద కోరిక లేదు.. ఏదో అయిపోవాలంటే ఆశ అంతకంటే లేదు.. నాకు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం దొరికింది.. దాన్ని మించిన పదవి నాకు అవసరం లేదు.. అన్నీ బాగుండి అది కూడా వస్తే అప్పుడు చూద్దాం అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. తనకు ముఖ్యమంత్రి పీఠంపై మోజు లేదని.. అలాంటి పదవీ కాంక్షతో రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. మూడేళ్లు సినిమా చేయలేదన్న భావన నాకు కలగలేదు. నా మనసెప్పుడూ సమాజం, దేశం, అభిమానుల కోసం ఆలోచిస్తుందన్నారు. సినిమా పరిశ్రమకు నేనొచ్చి 24 ఏళ్లు అయ్యిందంటే నాకు తెలియలేదు. తెలుగు చిత్రసీమలో అద్భుత విజయాలు సాధించి, మహోన్నత స్థానానికి వెళ్లిన నిర్మాత... ‘దిల్’ రాజుగారు నాతో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన ‘తొలిప్రేమ’ పోస్టర్ చూసి ఆ చిత్ర నిర్మాత జీవీజీ రాజుగారి దగ్గరకు వచ్చి కొంటానన్నారు. షూటింగ్ స్టార్ట్ చేయకుండా ఎవరొచ్చారని ఆశ్చర్యపోయానన్నారు. ఇంకా ఎన్నో విషయాలను ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దాదాపు అరగంట పాటూ పవన్ మాట్లాడారు. 'వకీల్ సాబ్'తో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పవన్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' తెలుగు రీమేక్‌గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

అపరిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా
18 hours ago

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది
14 hours ago

ఇప్పటికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు
20 hours ago

వకీల్ సాబ్ మూవీలో.. బద్రి మూవీ
09-04-2021

మాల్దీవుల్లో స్విమ్ సూట్లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..
09-04-2021

మూడేళ్ల మూడు నెలల గ్యాప్ తర్వాత బొమ్మ పడింది
09-04-2021

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా
08-04-2021

సిసింద్రీ ట్రయల్ వర్కవుట్ అవుతుందా
08-04-2021

రామ్ చరణ్ నే లైట్ తీసుకుంది.. అనుపమ మొండి మనిషే
08-04-2021

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే
08-04-2021
ఇంకా