newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

మహేష్ - పూరి కాంబినేషన్ సెట్ అయ్యిందా..?

18-10-202018-10-2020 12:05:13 IST
Updated On 18-10-2020 12:23:35 ISTUpdated On 18-10-20202020-10-18T06:35:13.858Z18-10-2020 2020-10-18T06:35:09.616Z - 2020-10-18T06:53:35.704Z - 18-10-2020

మహేష్ - పూరి కాంబినేషన్ సెట్ అయ్యిందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలవడం.. ఈ రెండు సినిమాలు మహేష్‌, పూరి ఇద్దరికీ మంచి పేరు తీసుకురావడం తెలిసిందే. దీంతో వీరిద్దరు కలిసి హ్యాట్రిక్ మూవీ ఎప్పుడు చేస్తారా..? అని అటు మహేష్ అభిమానులు.. ఇటు పూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే... పూరి కథ చెప్పినప్పటికీ.. మహేష్‌ ఎటూ తేల్చడం లేదని గతంలో పూరి మీడియాకి చెప్పడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.

ఇక మహేష్ బాబు తో పూరి సినిమా లేనట్టే అనుకున్నారు. దీంతో పూరి - మహేష్‌ తో తీయాలనుకున్న జనగణమన చిత్రాన్ని వెంకీతో తీయాలి అనుకున్నారు. కథ చెప్పడం.. వెంకీకి నచ్చడం జరిగింది కానీ.. ఈ మూవీకి బడ్జెట్ ఎక్కువు అవుతుంది. వెంకీతో భారీ బడ్జెట్ తో మూవీ చేస్తే వర్కవుట్ కాదేమో అనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఆతర్వాత పూరి కన్నడ రాక్ స్టార్ యాష్‌ తో జనగణమన సినిమా తీయనున్నట్టు వార్తలు వచ్చాయి. కేజీఎఫ్ 2 తర్వాత యాష్ పూరితో జనగణమన తీయనున్నారని జోరుగా వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే... తాజాగా మహేష్‌ తో మూవీ చేసేందుకు పూరి జనగణమన కథకు తుది మెరుగులు దిద్దుతున్నారని.. ఖచ్చితంగా మహేష్‌ తో పూరి సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి.. ఇదే కనుక నిజమైతే...అటు మహేష్‌ ఇటు పూరి అభిమానులకు పండగే.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle