newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఎన్టీఆర్, పీవీ, బాలు.. భారతరత్న వచ్చేది ఎవరికి..?

29-09-202029-09-2020 19:13:57 IST
2020-09-29T13:43:57.341Z29-09-2020 2020-09-29T13:43:54.315Z - - 25-10-2020

ఎన్టీఆర్, పీవీ, బాలు.. భారతరత్న వచ్చేది ఎవరికి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారతరత్న ఇప్పుడు మరోసారి తెర పైకి వచ్చింది. కారణం..గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ పెరగడమే. బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన తర్వాత హీరో అర్జున్ బాలుకు భారతరత్న ఇవ్వాలని.. దీని కోసం తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమ అంతా కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. దీంతో బాలుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. అయితే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసారు.

దీనికి కమల్ హాసన్ స్పందిస్తూ... బాలుకు భారతరత్న ఇవ్వాలని లేఖ రాసిన జగన్ ను ప్రత్యేకంగా అభినందించారు. తెలుగునాట బాలుకు భారతరత్న ఇవ్వాలని కోరడంతో పాటు ఎప్పటి నుంచో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఉంది. చంద్రబాబు అప్పట్లో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసారు కానీ.. ఆయన ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలో అంతగా కృష్టి చేయలేదని.. ఆయన తలుచుకుంటే.. ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు జరిగేదనే వాదన ఉంది. అలాగే భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ కూడా ఉంది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్, పీవీ, బాలు ఈ ముగ్గురుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. మరి.. భారతరత్న ఈ ముగ్గురికి దక్కుతుందా..? లేదా ముగ్గురులో ఇద్దరికో ఒక్కరికో దక్కుతుందో చూడాలి.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle