newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

లార్డ్ స్కందగిరి ఆలయంలో 365 ఒత్తులను వెలిగించిన 'నిఖిల్'

30-11-202030-11-2020 18:41:17 IST
Updated On 01-12-2020 10:59:50 ISTUpdated On 01-12-20202020-11-30T13:11:17.282Z30-11-2020 2020-11-30T13:10:33.758Z - 2020-12-01T05:29:50.901Z - 01-12-2020

లార్డ్ స్కందగిరి ఆలయంలో 365 ఒత్తులను వెలిగించిన 'నిఖిల్'
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కార్తికేయ ఈ చిత్రంతో యంగ్ హీరో నిఖిల్ ఖాతాలోకి విజయం వచ్చి చేరింది. ఆ చిత్రం విజయంతో అదే సెంటిమెంట్ గా ఫాలో అవుతున్నాడు ఈ హీరో..ప్రతి ఏడాది కార్తిక మాసంలో 365వత్తులు వెలిగించడం అనవాయితీగా పెట్టుకున్నాడు నిఖిల్. ఈ ఏడాది కూడా నిఖిల్ 365వత్తులను వెలిగించాడు. ఇది కార్తీక మాసం.. ఆద్యంతం శివభక్తులే గాక సామాన్య పౌరులు ఎంతో నిష్ఠగా శివుని ఆరాధిస్తుంటారు. సామాన్యుడు సెలబ్రిటీ అనే విభేధం లేదు. ప్రతి ఒక్కరూ శివారాధనతో తరిస్తుంటారు. ఇక ఈ మాసం అంతా సికింద్రాబాద్ లార్డ్ కార్తికేయ స్కందగిరి ఆలయంలో నిత్యదీపారాధన సాగుతుంటుంది. ఓ సాధారణ భక్తుడిలా మారిపోయాడు నిఖిల్.

నేడు కార్తీక సోమవారం సందర్భంగా హీరో నిఖిల్ స్కందగిరి ఆలయానికి వెళ్లారు. అక్కడ 365 వత్తులని వెలిగించి కార్తికేయుని ఆరాధించాడు. కార్తికా పౌర్ణమి పవిత్రమైన నెల కాబట్టి మహిళలు పురుషులు అనే భేధం లేకుండా పూజలు ఆచరిస్తున్నారు. అందరితో కలిసిపోయి నిఖిల్ దీపారాధన చేయడం ఆసక్తికరం. ఈ నెలలో ఈ ఆలయానికి భారీగా రష్ ఉంటుంది. అయినా ప్రతి సంవత్సరం నిఖిల్ సిద్ధార్థ్ ఈ ఆలయానికి 365 దీపాలను వెలిగించటానికి వెళుతున్నారు. ఇది అతడి సాంప్రదాయంగా మారిపోయింది. సంవత్సరంలో 365 రోజులకు సరిపడా 365 ద్వీపాలను వెలిగించడం ఆచారం.

నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ జోడీ సీక్వెల్ పనిలో ఉన్నారు. సోలో హీరోగా నిఖిల్ కు మొట్టమొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన కార్తికేయ మూవీ అంటే అతడికి ఎంతో ప్రత్యేకం. కార్తికేయ 2 తో మరో సంచలన విజయం దక్కాలని శివకార్తికేయులను ప్రార్థించినట్టు ఉన్నాడీ హీరో. ‘కార్తికేయ’ అభిమానులు ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్ట్ 1 ను మించి థ్రిల్ చేసే ఆసక్తికర కథనంతో చందూ ఈ సినిమాని రూపొందిస్తారనే ఆశిస్తున్నారు. హీరోయిన్ తదితర విషయాలను త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారీ చిత్ర యూనిట్. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle