newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

బాలయ్య మూవీలో నారా రోహిత్ నటిస్తున్నాడా..?

22-11-202022-11-2020 11:56:46 IST
2020-11-22T06:26:46.740Z22-11-2020 2020-11-22T06:26:41.510Z - - 06-12-2020

బాలయ్య మూవీలో నారా రోహిత్ నటిస్తున్నాడా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు వేటికవే వైవిధ్యంగా ఉంటాయట. ముఖ్యంగా బాలయ్య అఘోరా గెటప్ లో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై బోయపాటి కానీ.. బాలయ్య కానీ.. క్లారిటీ ఇవ్వలేదు కానీ.. నిజంగానే బాలయ్య అఘోరా గెటప్ లో కనిపించనున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే... ఈ సినిమాలో మరో హీరో నారా రోహిత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. క్యారెక్టర్ ఏంటంటే...ఒక యంగ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ అట. ఈ క్యారెకర్ట్ లో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. త్వరలోనే నారా రోహిత్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని టాక్. ఇంకా చెప్పాలంటే... లెజెండ్ సినిమా జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతటి పేరు తీసుకువచ్చిందో... నారా రోహిత్ కి కూడా ఈ సినిమా అంతటి పేరు తీసుకువస్తుంది అంటున్నారు.

యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. త్వరలోనే ప్రగ్యా జైస్వాల్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కానుందని తెలిసింది. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య - బోయపాటి కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. సినిమా మాత్రం ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. 2021 సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle