newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పెనను వీక్షించిన బాలయ్య

21-02-202121-02-2021 18:19:29 IST
Updated On 22-02-2021 10:36:38 ISTUpdated On 22-02-20212021-02-21T12:49:29.689Z21-02-2021 2021-02-21T03:24:38.578Z - 2021-02-22T05:06:38.042Z - 22-02-2021

కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పెనను వీక్షించిన బాలయ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంచి సినిమా అంటే చాలు టాలీవుడ్ సెలెబ్రిటీలు సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాదులో 'ఉప్పెన' చిత్రాన్ని వీక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి 'ఉప్పెన' చిత్రాన్ని చూశారు. సినిమా అద్భుతంగా ఉందంటూ నటీనటులు, దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు, నిర్మాతలను అభినందించారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన `ఉప్పెన` సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి, విజయ్ సేతుపతి బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాను చూసిన అంద‌రూ బావుంద‌ని ప్ర‌శంసించారు. తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ కూడా కుటుంబంతో క‌లిసి `ఉప్పెన‌` సినిమాను వీక్షించి సినిమా చాలా బావుంద‌ని అభినందించారు‌. సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్,మెగాస్టార్ చిరంజీవి మరికొంతమంది సెలబ్రిటీలు ఇప్పటికే ‘ఉప్పెన’ పై ప్రశంసలు కురిపించారు.

ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టయింది. ప్రేమకథ కావడంతో యూత్ నుంచి విశేష స్పందన వస్తోంది. లాక్ డౌన్ తర్వాత థియేటర్లు పూర్తిసామర్థ్యంతో నడుస్తున్న నేపథ్యంలో రిలీజైన 'ఉప్పెన' హౌస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం క్లైమాక్స్ కొత్తగా ఉండడంతో ప్రజలు కూడా సినిమాను ఆస్వాదిస్తూ ఉన్నారు.

ఇప్పటికే 70కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా. ఇక ఓవర్సీస్ లో కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు హాఫ్ మిలియన్ మార్క్ ను దాటింది. ఓవర్సీస్ లో ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో వసూళ్లు  వచ్చిన తెలుగు సినిమా  ఉప్పెననే అని అంటున్నారు. ఇకపై విడుదలయ్యే సినిమాలకు కూడా ఓవర్సీస్ లో మంచి ఆదరణ లభిస్తుందని  నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండో వారంలో కూడా ఉప్పెన సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు నమోదవుతూ ఉన్నాయి. కొత్తగా నాలుగు సినిమాలు విడుదలైనా కూడా ఉప్పెననే మొదటి ఛాయిస్ గా చేసుకుంటూ ఉంటోంది యువత. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle