newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

ఇండియాలో భారీ బడ్జెట్ తో నాగార్జున నటించే సినిమా!

30-11-202030-11-2020 21:18:17 IST
Updated On 01-12-2020 10:45:48 ISTUpdated On 01-12-20202020-11-30T15:48:17.617Z30-11-2020 2020-11-30T15:48:12.313Z - 2020-12-01T05:15:48.538Z - 01-12-2020

ఇండియాలో భారీ బడ్జెట్ తో నాగార్జున నటించే సినిమా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓ పక్క బిగ్ బాస్ షోతో పాటు పలు సినిమా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున..ఆయన ఎనర్జీకి నేటి యంగ్ హీరోలు కూడా దాసోహం అవుతుంటారు. ఈ ఏజ్ లో కూడా నిత్యం వర్క్ వుట్స్ చేస్తూ తన స్టామినాని కాపాడుకోవడం నాగార్జునకి ఎంతో ఇష్టమయిన పని..నాగ్ తో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అమల..కుమారులు నాగచైతన్య..అఖిల్..కోడలు సమంత వీరంతా కూడా ఫిట్ నెస్ ఫ్రీక్ లే. నాగార్జున్ తాజా చిత్రం వైల్డ్ డాగ్. ఈ చిత్రంతో పాటు ఆయన బాలీవుడ్ మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తున్నారు. ఈ చిత్రం స్టార్ట్ అయి రెండేళ్ళు అయింది. 

బాలీవుడ్ నటీనటులు రణ్ బీర్ కపూర్.. ఆలియా భట్ జంటగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్.. నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా బ్రహ్మస్త్ర. అమితాబ్..నాగార్జునల మధ్య ఉన్న స్నేహ బంధం గురించి తెలిసిన విషయమే. ఈ సినిమా గురించి గత రెండేళ్లుగా బాలీవుడ్ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా బడ్జెట్ విషయంలో మరోసారి ఆసక్తికర చర్చ జాతీయ మీడియాలో జరుగుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకు ఖర్చుచేయనంత బడ్జెట్ ను ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నట్లుగా హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో ప్రకటించడం విశేషం. ఖచ్చితంగా ఎంత బడ్జెట్ అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కాని 2.ఓ... సాహో మరియు బాహుబలిని మించిన బడ్జెట్ తో బ్రహ్మస్త్ర రూపొందుతున్నట్లుగా జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాల బడ్జెట్ కంటే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ అంటూ వారు చెబుతున్నారు. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. డిస్నీ సంస్థ మరియు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మరి కొన్నాళ్లకు పూర్తి అవ్వబోతుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్ కి ఆలస్యానికి కరోనా కూడా ఓ కారణమయింది. కాగా రణ్ బీర్..ఆలియాలు పెళ్ళి పీటలు ఎక్కనున్నారు గానీ ఎప్పుడనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle