newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

న్యూ లుక్ లో.. కూల్ గా కనిపిస్తోన్న యంగ్ హీరో

30-09-202030-09-2020 16:02:48 IST
2020-09-30T10:32:48.805Z30-09-2020 2020-09-30T10:32:46.451Z - - 21-10-2020

న్యూ లుక్ లో.. కూల్ గా కనిపిస్తోన్న యంగ్ హీరో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యంగ్ హీరో  నాగశౌర్య  రీసెంట్ గా  ఓ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో  నాగశౌర్య రెండు షేడ్స్‌లో కనిపిస్తాడని టాక్. ఆ లుక్ కోసం  ఈ యంగ్  హీరో తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. ఇది వరకు 8ప్యాక్‌బాడీతో పాటు పోనీ టెయిల్‌ హెయిర్‌తో ఉన్న నాగశౌర్య లుక్‌ నెట్టింట హల్‌చల్‌ చేసింది. ఈ లుక్‌ తో ఆ చిత్ర చిత్రీకరణ పూర్తయ్యింది. దీంతో నాగశౌర్య తన లుక్‌ను మార్చుకున్నాడట. ట్రిమ్‌ చేసిన గడ్డంతో ఉన్న లుక్‌లోకి నాగశౌర్య కొత్త లుక్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. నాగశౌర్య ఈ లేటెస్ట్‌ లుక్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

ఇక ఈ చిత్రం గురించి మాట్లాడుకుందాం.. ఆర్చరీ బ్యాక్‌డ్రాప్‌లో నాగశౌర్య 20వ సినిమాగా తెరకెక్కుతోంది. సంతోష్‌ అనే డెబ్యూ డైరెక్టర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలి కాలంలో యువహీరోల కమిట్ మెంట్ గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు అలుపెరగక శ్రమిస్తున్న తీరు ఆ ఇన్వాల్వ్ మెంట్ ముచ్చటగొలుపుతోందనే చెప్పాలి.

క్యారెక్టర్ కోసం కటౌట్ పెంచాలన్నా.. గడ్డం మీసాలు పెంచాలన్నా అందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. ఎంత రిస్కయినా శ్రమిస్తున్నారు. అలవాటుపడుతున్నారు. ఇటీవల ఆరేడు నెలలుగా నాగశౌర్య నిండుగా పెరిగిన గడ్డంతో కనిపించి షాకిచ్చాడు. భీకరంగా దేహాకృతిని మార్చాడు. కండలు మెలితిప్పి 8 ప్యాక్ లతో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఇప్పటికే అతడి లుక్ కూడా వైరల్ అయ్యింది. అయితే ఉన్నట్టుండి శౌర్య ట్రిమ్ చేసిన గడ్డంతో కనిపించి షాకిచ్చాడు.

నాగశౌర్య ఫస్ట్  సినిమా "క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్". జాతీయ బహుమతి పొందిన తెలుగు సినిమా చందమామ కథలులో హాస్య పాత్రను పోషించాడు శౌర్య. ఆ  తరువాత ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య చిత్రాలలో హీరోగా నటించాడు. మొదటి పాత్రలో నటించే ముందు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడట శౌర్య. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. అవకాశాలు లేక నిరాశతో తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలనుకున్నాడు. అప్పుడు ఆయన వారాహి చలన చిత్రం ద్వారా ప్రకటనను చూశాడు. ఆ ప్రకటనలో అవసరాల శ్రీనివాస్ నిర్మిస్తున్న హాస్య చిత్రం ఊహలు గుసగుసలాడే  కోసం ఆయన ఆ తన ప్రొఫైల్ ను పంపించాడు. ఆయనకు ఆశలు లేనప్పటికి   అందులోని ముఖ్యపాత్ర కోసం ఎంపిక అయి హీరోగా నిరూపించుకున్నాడు.

 

సీఎంగా చిరు - డైరెక్టర్ వినాయక్. ఆతర్వాత ఏమైంది..?

సీఎంగా చిరు - డైరెక్టర్ వినాయక్. ఆతర్వాత ఏమైంది..?

   7 hours ago


ఆర్ఆర్ఆర్ పై అప్ డేట్ ఇచ్చిన చిత్రయూనిట్. ఇంతకీ ఏంటది..?

ఆర్ఆర్ఆర్ పై అప్ డేట్ ఇచ్చిన చిత్రయూనిట్. ఇంతకీ ఏంటది..?

   8 hours ago


చిరు, ప‌వ‌న్ ని ఫాలో అవుతున్న‌ మోహ‌న్ బాబు

చిరు, ప‌వ‌న్ ని ఫాలో అవుతున్న‌ మోహ‌న్ బాబు

   9 hours ago


ఏంటి నోయ‌ల్ ఓట్ల‌కోసం తండ్రి గురించి ఇలా చెప్తావా.. క్లారిటీ ఇదిగో

ఏంటి నోయ‌ల్ ఓట్ల‌కోసం తండ్రి గురించి ఇలా చెప్తావా.. క్లారిటీ ఇదిగో

   10 hours ago


ట్రాన్స్ జెండర్స్ తో ‘లక్ష్మీ బాంబ్' చిత్రం ప్రమోషన్..

ట్రాన్స్ జెండర్స్ తో ‘లక్ష్మీ బాంబ్' చిత్రం ప్రమోషన్..

   11 hours ago


బాలయ్య నర్తనశాల ఫస్ట్ లుక్ రిలీజ్

బాలయ్య నర్తనశాల ఫస్ట్ లుక్ రిలీజ్

   12 hours ago


మెగా హీరో మూవీలో న‌టిస్తున్న రానా. ఇంతకీ ఏ సినిమాలో..?

మెగా హీరో మూవీలో న‌టిస్తున్న రానా. ఇంతకీ ఏ సినిమాలో..?

   13 hours ago


పాపం బ్రహ్మాజీ... ఏదో చేద్దాం అనుకుంటే.. ఇంకేదో అయ్యింది!

పాపం బ్రహ్మాజీ... ఏదో చేద్దాం అనుకుంటే.. ఇంకేదో అయ్యింది!

   13 hours ago


ఇటలీలో పిల్లలతో ఎంజాయ్ చేస్తోన్న బాహుబలి..

ఇటలీలో పిల్లలతో ఎంజాయ్ చేస్తోన్న బాహుబలి..

   14 hours ago


'దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే'కి అరుదైన గౌరవం..

'దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే'కి అరుదైన గౌరవం..

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle