newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్టార్ స్టేటస్ వచ్చినా సినిమాలకు బ్రేక్ పడటంతో తెగ ఫీలైపోతున్న పూజా హెగ్డే

19-04-202119-04-2021 14:24:21 IST
2021-04-19T08:54:21.743Z19-04-2021 2021-04-19T08:53:22.395Z - - 14-05-2021

స్టార్ స్టేటస్ వచ్చినా సినిమాలకు బ్రేక్ పడటంతో తెగ ఫీలైపోతున్న పూజా హెగ్డే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అందరూ హీరోయిన్లు కోరుకునే స్టార్ స్టేటస్ ఆమెకు వచ్చింది, కొత్త హీరో నుండి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా ఆమే హీరోయిన్గా కావాలని పట్టుబడుతున్నారు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఆమెవైపే మొగ్గు చూపుతున్నారు. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది ఆమె ఎవరో. పూజా హెగ్డే మోస్ట్ సక్సెస్ ఫుల్ బాలీవుడ్ హీరోయిన్. బాలీవుడ్ కంటే ఆమెకు టాలీవుడ్ లోనే క్రేజ్ ఎక్కువ అందుకే ఆమెకు బాలీవుడ్ లో కంటే ఇక్కడే స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఫుల్ బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్ పూజా హెగ్డే. 

ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రణవీర్ సింగ్ తో సర్కస్, ఆచార్య సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. స్టార్ స్టేటస్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని అలోచించి రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. ప్రొడ్యూసర్లు కూడా ఆ రెమ్యునరేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇంకేముంది ఈ ఆనందానికి అవుదులు లేవు గాలిలో తేలిపోయింది. అయితే ఆ అమ్మడు ఆశలపై నీళ్లు చల్లింది కరోనా. షూటింగ్ లో ఉన్న సినిమాలకు బ్రేక్ పడింది, షూటింగ్ మొదలు కావలసిన సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇంకేముంది చేసేది ఏమి లేక ఈ అమ్మడు బయటికి చెప్పక పోయిన తన రిలేటివ్స్, ఫ్రెండ్స్ తగ్గార లబో దిబో మంటూ వాపోతుంది.