newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

భక్తవత్సల నాయుడి సినీ రంగ ప్రయాణానికి 45ఏళ్ళు

22-11-202022-11-2020 16:13:55 IST
Updated On 23-11-2020 13:05:14 ISTUpdated On 23-11-20202020-11-22T10:43:55.069Z22-11-2020 2020-11-22T10:43:34.457Z - 2020-11-23T07:35:14.323Z - 23-11-2020

భక్తవత్సల నాయుడి సినీ రంగ ప్రయాణానికి 45ఏళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేటితో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ రంగప్రవేశం చేసి 45ఏళ్ళు పూర్తయిందట. తనదైన నటనతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు. హీరోగానే కాదు విలన్ గా కూడా తన నట విశ్వరూపాన్ని చూపించి విశేషంగా అభిమానులని సంపాదించుకున్నాడు. భ‌క్త‌వ‌త్స‌ల నాయుడు.. ఈ పేరు పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌క‌పోవ‌చ్చు, కాని మోహ‌న్ బాబు అంటే గుర్తు ప‌ట్ట‌ని తెలుగు ప్రేక్ష‌కులు  ఉండ‌రు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించిన మోహన్‌బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. ఇటీవ‌ల విడుద‌లైన ఆకాశం నీ హ‌ద్దురా అనే సినిమాలో భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు అనే పాత్ర‌లో న‌టించి మెప్పించాడు కూడా.

విల‌న్‌గా, హీరోగా, స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లోను న‌టించిన క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో 45 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు.హీరోగా రాణిస్తున్న స‌మ‌యంలో మోహ‌న్ బాబుకు ప్ర‌త్యే శైలి ఉండేది. మోహ‌న్ బాబు చెప్పే డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదాన్ని అందిస్తుంటాయి. కంచు మోగిన‌ట్టు మోహ‌న్ బాబు గ‌ళం నుండి వ‌చ్చే డైలాగ్స్ థియేట‌ర్‌ని ద‌ద్ద‌రిల్లేలా చేస్తుంటాయి. మెగాస్టార్ చిరంజీవి చిత్రాలలో పోటా పోటీగా నటించేవారు. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి కూడా. కెరీర్ లో ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేసిన మోహ‌న్ బాబు ప్ర‌స్తుతం స‌న్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నాడు.

దేశభక్తి ప్రధానంగా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌, 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా శనివారం ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కోపోద్రిక్తుడై తీక్షణ చూపులతో కనిపిస్తున్నారు మోహన్‌బాబు. ఇప్పటివరకు తెలుగు తెరపై రానటువంటి కథాంశంతో వినూత్నమైన జోనర్‌లో సినిమా రానుంది. మోహన్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ పాత్రకి తనవంతు న్యాయం చేస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నారు దర్శక..నిర్మాతలు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle